సారథి న్యూస్, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు టీపాస్ బీ పాస్ వెబ్ సైట్ ను రూపొందించామని మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వివరించారు. సోమవారం ఆయన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దరఖాస్తుదారుడు స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారని తెలిపారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. 600 […]
పట్టభద్రుల నియోజకవర్గాల్లో పోటీపై టీఆర్ఎస్లో తీవ్ర కసరత్తు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి దేశపతి శ్రీనివాస్ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి బొంతు రామ్మోహన్ సారథి న్యూస్, హైదరాబాద్: త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి.. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఆశావహులు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. ఆయనకు […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయనున్నాడు. అందుకోసం ఆయన విపక్షాల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి పోటీచేసినప్పటికీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో తెలంగాణ యువత, నిరుద్యోగుల్లో కోదండరాం పట్ల సానుభూతి ఉన్నది. సోషల్‌మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఈ క్రమంలో గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగితే కోదండరాం తేలిగ్గా గెలుస్తారని […]
సారథి న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ, నేతలను విమర్శించే స్థాయి కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు లేదని, ఆ పార్టీ బీసీసెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వసుపత్రుల పనితీరు మెరుగుపడాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క యాత్ర చేపడితే టీఆర్ఎస్ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే కరోనా ఉధృతితో […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో రూ.16.30 కోట్ల వ్యయంతో ఆరు థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ మేయర్బొంతు రామ్మోహన్వెల్లడించారు. బుధవారం ఉప్పల్ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి కాప్రా సర్కిల్‌లో పరిధిలో పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్బీ నగర్జోన్ పరిధిలో రూ.29.25 కోట్ల అంచనా వ్యయంతో 13 థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ థీమ్ పార్కులలో యోగా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్‌లు ఉంటాయన్నారు. ఢిల్లీ, […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఏవీ లేకపోయినా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో మేయర్ హోం క్వారంటైన్లో ఉంటున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే కోలుకుంటానని మేయర్ ట్వీట్ చేశారు.
సియోల్: కనిపించకుండా పోయిన దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగర మేయర్ పార్క్ వున్‌సూన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గురువారం ఉదయం నుంచి కనిపించలేదు. కాగా.. శుక్రవారం నగరానికి దగ్గరలోని కొండలపై శవమై కనిపించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు మేయర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు ఆత్మహత్య కింద కేసు నమోదు చేశారు. కాగా.. ఆయన ఆఫీస్ నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ‘ప్రతి ఒక్కరికీ సారీ. […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో గురువారం నిర్వహించే ఆరో విడత హరితహారం కార్యక్రమానికి అంతా రెడీచేశామని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఎమ్మెల్యే కాలనీలోని విజయ నర్సరీని బుధవారం ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. 29 నర్సరీలు 50 లక్షల మొక్కలతో సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్నగర ప్రజలు విరివిగా పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు