Breaking News

MAHABUBNAGAR

వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శనివారం పర్యటించారు. నాలాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి జిల్లా కేంద్రంలో భారీవర్షం కారణంగా జలమయమైన ప్రాంతాల్లో పర్యటించారు. రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, గణేష్ నగర్, ఎంబీసీ కాంప్లెక్స్, బృందావన్ కాలనీలో కలియతిరిగారు. జలదిగ్బంధమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాలాలపై […]

Read More

బొంకూర్ పెద్దవాగు.. ఉధృతం

సారథిన్యూస్​, గద్వాల: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల రైతుల పంటలు నీటమునిగాయి. వరద ధాటికి రాకపోకలు ఆగిపోయి పలువురు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు దాటికి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ,ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు అధికారులు వాగుల వద్ద పర్యవేక్షిస్తున్నారు.

Read More

మార్కెట్​కమిటీ చైర్​పర్సన్​గా సుగుణ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్​పర్సన్​గా కొండా సుగుణ నియమితులయ్యారు. శుక్రవారం ఆమె దేవరకద్రలోని శ్రీనివాస గార్డెన్​ ఫంక్షన్​హాల్​లో ప్రమాణం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు వి.శ్రీనివాస్​గౌడ్​, ఎస్​.నిరంజన్​రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

Read More
కోయిల్ సాగర్ కు పోటెత్తిన వరద

కోయిల్ సాగర్ కు పోటెత్తిన వరద

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్​నగర్ ​జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ కు మంగళవారం వరద నీరు పోటెత్తింది. దీంతో నాలుగు షట్టర్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు రోజులుగా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టుల్లోకి పెద్దఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యానికి మించి చేరడంతో గేట్లను తెరిచినట్టు అధికారులు తెలిపారు.

Read More
వైభవంగా బోనాల వేడుకలు

వైభవంగా బోనాల వేడుకలు

సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో మంగళవారం గ్రామ దేవత పోచమ్మ బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో మహిళలు బోనం కుండలతో ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానం వద్దకు తరలొచ్చారు. అనంతరం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించారు. వేడుకల సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. పరిసరాలను మామిడి తోరణాలు, వేపాకుల మండలతో ముస్తాబు చేశారు.

Read More
మన్నెంకొండలో వైభవంగా తిరుచ్చిసేవ

మన్యంకొండలో వైభవంగా తిరుచ్చిసేవ

సారథి న్యూస్,​ దేవరకద్ర: మహబూబ్​నగర్ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి తిరుచ్చిసేవా కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి శనివారం రాత్రి స్వామివారి తిరుచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయపాలకవర్గం వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా భక్తులు హాజరుకాలేదు. వేదపండితులు, పురోహితుల ఆధ్వర్యంలోనే ఈ ఘట్టం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్​ నిత్యానందచారి, ప్రధాన పూజారులు […]

Read More
శతాధిక వృద్ధుడు మృతి

శతాధిక వృద్ధుడు మృతి

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఆదివారం ఓ శతాధిక వృద్ధుడు మృతిచెందాడు. స్థానికుడైన కొండాపురం హన్మిరెడ్డి(103) 1917 లో జన్మించాడు. అయితే ఎప్పుడు చలాకీగా ఉండే హన్మిరెడ్డి తన పని తాను చేసుకుంటూ హాయిగా ఉండేవాడు. ఈనెల 9న ప్రమాదవశాత్తు కాలు జారిపడి అస్వస్థతకు గురయ్యాడు. ఆరోగ్యం బాగా క్షీణించడంతో మృతిచెందాడు. ఈ ఘటనతో విషాదం నెలకొంది.

Read More
ఆ ఊరుతో కరోనా కలకలం

ఆ ఊరులో కరోనా కలవరం

సారథి న్యూస్, మిడ్జిల్: సాధారణంగా అన్ని గ్రామాల మాదిరిగానే ఆ ఊరులోనూ ఎక్కువగా వలస వెళ్లి బతికే కూలీలు, కార్మికులు ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడెక్కడ ఉన్నవారంతా తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నారు. దీంతో ఏ ఇల్లూ చూసినా ఇంటిల్లిపాదితో కళకళలాడుతోంది. ఆ గ్రామంలో ఏ పండుగనైనా కలిసిమెలిసే జరుపుకుంటారు. అయితే గ్రామస్తులంతా పెద్దఎత్తున జరుపుకునే వేడుకల్లో పీర్ల పండగ ఒకటి. ఇంత వరకు బాగానే ఉన్నా.. మొహర్రం తర్వాత ఈ గ్రామంలో నిశ్శబ్దం ఆవహించింది. […]

Read More