సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత, ప్రముఖ కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియులు గురువారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నాయిని పాడెను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ మోసి తమకు ఉన్న అభిమానం చాటుకున్నారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శనివారం పర్యటించారు. నాలాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి జిల్లా కేంద్రంలో భారీవర్షం కారణంగా జలమయమైన ప్రాంతాల్లో పర్యటించారు. రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, గణేష్ నగర్, ఎంబీసీ కాంప్లెక్స్, బృందావన్ కాలనీలో కలియతిరిగారు. జలదిగ్బంధమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాలాలపై […]
సారథి న్యూస్, దేవరకద్ర: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. అందుకోసం సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తంచేశారని వెల్లడించారు. కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్.రాజేందర్ రెడ్డితో కలసి శనివారం 7.7లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కోయిల్ సాగర్ తో పాటు కోయిలకొండ, రామగిరిగుట్ట, రాంకొండ ప్రాంతాలు పర్యాటక కేంద్రాల […]
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ కవి, రచయిత దాశరథి కృష్ణమాచార్య సేవలు మరువలేనివని రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కొనియాడారు. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కృష్ణమాచార్య జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. నిజాం నవాబుకు వ్యతిరేకంగా గళమెత్తిన గొప్ప యోధుడు దాశరథి అని కొనియాడారు.
సారథిన్యూస్, మహబూబ్‌నగర్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మంత్రి ఎల్బీ స్టేడియాన్ని పరిశీలించి అక్కడ పూలతొట్టల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. డెంగ్యూతో ఇతర రోగాల నివారణకు వ్యాధి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, క్రీడాశాఖ ఉన్నతాధికారులు సుజాత, విమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: రవీంద్రభారతిలోని తన ఆఫీసులో తెలంగాణ ఫామ్ నీరా, ఫామ్ ప్రొడక్ట్ రీసెర్చ్ ప్రొడక్షన్, వేద ఫామ్ ప్రొడక్ట్స్ సంస్థ తయారుచేసిన తాటి బెల్లం, ఈత సిరప్ ఉత్పత్తులను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సోమవారం విడుదల చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్. టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ గౌడ్, గౌడ సంఘం నాయకులు అంబాల నారాయణ గౌడ్, వింజమూరి సత్యంగౌడ్, భానుచందర్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, నారాయణపేట: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ రైతన్నలా మారారు. అరక పట్టి పొలం దున్నారు. కొద్దిసేపు రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత జడ్పీ హైస్కూలులో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో పొలంలో విత్తనాలు వేస్తున్న రైతులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. విత్తనాలు అందుతున్నాయా.. లేదా.. అని అడిగి ఆరా తీశారు. మంత్రి తమతో […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా కోల్పోతున్న షాపుల యజమానులతో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. వారి సమ్మతితో విస్తరణ పనులను గురువారం ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.