సారథి న్యూస్, మహబూబ్‌నగర్: రెండు రోజుల క్రితం మంత్రి వి.శ్రీనివాస్గౌడ్తండ్రి నారాయణగౌడ్కన్నుమూసిన విషయం తెలిసిందే. మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. మహబూబ్‌నగర్‌లోని మంత్రి నివాసానికి వచ్చి ఆయన తండ్రి వి.నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్బెడ్రూమ్ఇళ్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్బండి విజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల మహాసభలను మార్చిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓ జర్నలిస్టును చంపుతానని బెదిరించడం, అసభ్యకరంగా మాట్లాడడం జర్నలిస్టు సమాజాన్ని అవమానపర్చడమేనని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు. సదరు ఎమ్మెల్యేను […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లాకు తలమానికమైన పిల్లలమర్రి పునర్జీవం సాధించింది. పట్టణ శివారులోని సుమారు మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. 700 ఏళ్ల వయస్సు ఉన్న ఈ మర్రివృక్షం ప్రఖ్యాత పర్యాటక క్షేత్రంగా వెలుగొందింది. మర్రి వృక్షాల కొమ్మలు, వేర్లకు చెదలు, శిలింద్ర వ్యాధులు సోకడంతో క్రమక్రమంగా క్షీణించింది. ఇది గమనించిన పూర్వ కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ప్రత్యేక చొరవ తీసుకుని బొటానికల్ గార్డెన్ శాస్త్రవేత్తలు, సంబంధిత డాక్టర్లను పిలిపించి సంరక్షణ చర్యలు చేపట్టారు. దీంతో పిల్లలమర్రి 140 […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: వచ్చే కురుమూర్తి జాతరకు ప్రజలెవరూ ఆలయానికి రావద్దని, ఇళ్ల వద్దనే పూజలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్‌హాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కురుమూర్తి జాతర ఉత్సవాలకు మన జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇళ్లవద్దనే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఆలయాధికారులు కరోనా నిబంధనలు […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: ఓ వైపు ఏసీబీ అధికారులు ఆట కట్టిస్తున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కీసర తహసీల్దార్ నాగరాజు, మెదక్ జేసీ ఉదంతం మరువకముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరోపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ రూ.1.65 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లో క్లోరినేషన్ మెటీరియల్ ను అలీ అహ్మద్ అనే వ్యాపారి సరఫరా […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: కరోనా నివారణకు ఆశా కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని నాగర్‌కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి ప్రశంసించారు. గురువారం కలెక్టరేట్లో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను సబ్బులు, శానిటైజర్లు, ఫ్రూట్‌జ్యూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనుచౌదరి మాట్లాడుతూ.. కరోనా నివారణకు వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ వైద్యసేవలు అందిస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రమేశ్‌రెడ్డి, ట్రెజరర్ రాధాకృష్ణ, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డి.కుమార్, బ్లడ్ […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలపై అశ్రద్ధ వహించొద్దని నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్కే యాస్మిన్ బాషా ఆదేశించారు. గడువులోగా రైతువేదికలు నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ మనుచౌదరితో కలిసి బిజినేపల్లి మండలం మహాదేవునిపేట, బిజినపల్లి, పాలెంలో పర్యటించారు. ఆస్తుల ఆన్లైన్ వివరాలు, రైతు వేదికనిర్మాణాలు తదితరల పనులను పరిశీలించారు. మహాదేవుని పేట గ్రామంలో గ్రామ పంచాయతీ […]
సారథిన్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆదివారం జెడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ను సన్మానించారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల జిల్లా అభివృద్ధికి సహకరించాలని ఆమె మంత్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.