Breaking News

మందుబాబులకు కోర్టు గుడ్​న్యూస్​

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో తమకు కావల్సిన బ్రాండ్​ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఏపీ హైకోర్టు గుడ్​న్యూస్​ చెప్పింది. ఇక నుంచి ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తమకు నచ్చిన మూడు ఫుల్​ బాటిళ్లు తెచ్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్​లో తమకు కావాల్సిన బ్రాండ్లు దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుందామంటే పోలీసులు, ఎక్సైజ్​ అధికారులు సీజ్​చేస్తున్నారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన ఓ వ్యక్తి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు తీసుకురావచ్చని తీర్పునిచ్చింది. జీవో 411 అమలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.