Breaking News

ఇదేం దందా సార్లూ..

ఇదేం దందా సార్లూ..

  • మద్యం రవాణా కేసులో కానిస్టేబుల్‌ అరెస్టు
  • టొయోటా కారు సీజ్‌.. 72 బాటిళ్లు స్వాధీనం
  • గతంలో హోంగార్డు దొరికిన వైనం

సారథి న్యూస్, కర్నూలు: పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేసే జాబితాలో సివిల్‌ పోలీసులు, హోంగార్డులు కూడా చేరుతున్నారు. జీతంతో సరి పెట్టుకోక.. అత్యాశ.. నన్నేవరూ ఏం చేయలేరన్న అహంభావంతో కొందరు పోలీసులు పక్క రాష్ట్రానుంచి మద్యం సరఫరా చేసే స్థాయికి దిగజారారు. సమాజంలో అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అహర్నిశలు కష్టపడుతూ.. ప్రజకు రక్షణగా నిలిచే వారు కొందరైతే సులువుగా డబ్బు సంపాదించాన్న వాంఛతో చెడుదారిన నడిచేవారు ఇంకొందరు ఉన్నారు. ఇటీవల పట్టుబడుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సారి ఎక్సైజ్‌ వ్యవస్థలో మార్పు తీసుకొస్తూ.. సెబ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. రాష్ట్రంలో అక్రమ మద్యం సరఫరాను నియంత్రించాలని, నాటుసారా, అక్రమ ఇసుక సరఫరాను కట్టడి చేయాలన్న లక్ష్యంతో సెబ్‌ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఏఎస్పీ గౌతమిసాలీ స్పష్టం చేస్తూనే ఉన్నారు. అక్రమ మద్యం సరఫరా చేసిన వారిలో మార్పు తీసుకురావాల్సిన పోలీసులే ఇలా అక్రమ మద్యం సరఫరా చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సమాజంలో.. చీడపురుగు
పారదర్శకత, అవినీతి రహిత పాలన అందించాన్న సదుద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేస్తుంటే కొంతమంది అనినీతి ఉద్యోగులు తమ పని కానిచ్చేస్తున్నారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌పేటకు చెందిన సురేష్‌ కుమార్‌ రెడ్డి, కర్నూలు– 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నేనావత్‌ సోమ్లానాయక్‌ ఇద్దరు కలిసి టొయోటా వాహనంలో పెద్ద మొత్తంలో మద్యం తరలిస్తుండగా హైదరాబాద్​– బెంగళూరు నేషనల్‌ హైవేపై టోల్‌ గేట్‌ ఆర్టీవో చెక్‌ పోస్టు వద్ద పట్టుకున్నారు. దాడుల్లో ఎస్సై స్వామినాథన్‌, సోమశేఖర్‌, సాగర్‌ రెడ్డి, సిబ్బంది లీమోహన్‌, నరసింహులు, సుధాకర్‌ రెడ్డి, రాజు నరసింహారెడ్డి పాల్గొన్నారు.