సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..ఇల్లెందు మండలం కోటన్ననగర్ సమీపంలోని అనంతారం చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్ ఎంబీ చేసి బిల్లు మంజూరు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో క్వాలిటీ కంట్రోల్ తనిఖీ కూడా పూర్తి కావడంతో బిల్లు […]
సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు తనిఖీ చేసి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని ఓ ఇంజిరింగ్ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీచేసి ముగ్గురు మహిళలతోపాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ జంటలను బెదిరించి వారివద్ద డబ్బు, నగలు దోపీడి చేస్తున్న ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రేగళ్ల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా వీరు పట్టుబడ్డారని చెప్పారు. జిల్లాకు చెందిన ఓ ఆరుగురు ముఠాగా ఏర్పడి ప్రేమజంటలను కత్తులు, మారణాయుధాలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరిపై దోపీడీ, దొంగతనం కేసులున్నాయని సీఐ అశోక్చ ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వీరి వద్ద నుంచి 10 తులాల […]
సారథిన్యూస్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలం పాపకొల్లులో శుక్రవారం ఆయన విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దుమ్ముగూడెం మండలం మహాదేవపురం గ్రామంలో రూ. 2.83 కోట్లతో నూతనంగా నిర్మించిన 45 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడంతోపాటు.. రూ. 22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం […]
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఊరూరా జోరుగా సాగుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక ఫారెస్ట్ రేంజ్ కు చెందిన 30 ఎకరాల్లో మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విప్ రేగా కాంతారావు తదితరులు మొక్కలు నాటారు. కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ కార్టర్స్‌లో ఎస్పీ సునీల్ దత్ హరితహారంలో పాల్గొన్నారు. బూర్గంపాడులోని సారపాక పుష్కర వనం వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ […]
సారథిన్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్ అయ్యింది. బంధువులే ఆమెను కిడ్నాప్ చేశారని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేని రెడ్డిపాలెనికి చెందిన అశోక్‌రెడ్డి, పూజిత ప్రేమించుకున్నారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఏపీలోని ఓ దేవాలయంలో వారు వివాహం చేసుకున్నారు. అనంతరం బూర్గంపాడు ఠాణాకి వెళ్లి తమ పెళ్లి విషయం చెప్పారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి […]
సారథిన్యూస్, కొత్తగూడెం: సింగరేణిలో ఎక్స్ ప్లోరేషన్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడెంలో కాంట్రాక్ట్ కార్మికులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలోనే ప్రత్యామ్నాయ పనులలో వీరికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పీ ప్రమోద్, ఎన్ సూర్య, భద్రం, నిజాముద్దీన్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, సంపత్, సమ్మయ్య, […]
సారథి న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా ప్రబలకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ సూచించారు. శుక్రవారం ఆయన పోలీసు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు. అన్ని పోలీస్స్టేషన్లలో థర్మల్ స్ర్కీనింగ్ పరీక్షలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టులు నమోదు చేయాలని ఆదేశించారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించిన […]