Breaking News

KOHLI

ఇండియాదే టీ20 సిరీస్​

భారత్​దే టీ20 సిరీస్​

హార్దిక్​ పాండ్యా వీరోచిత బ్యాటింగ్​ హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్న గబ్బర్​ సిడ్నీ: పొట్టి క్రికెట్​లో టీమిండియా గట్టి సవాల్​ను ఛేదించింది. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టీ20 సిరీస్​ను టీమిండియా ఒక మ్యాచ్​మిగిలి ఉండగానే సీరిస్​ను గెలుచుకుంది. ఆదివారం జరిగిన రెండవ టీ20 మ్యాచ్​లో కోహ్లీసేన ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా 2‌‌‌‌–0 తేడాతో సిరీస్​ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను టీమిండియా 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్​ […]

Read More
ఆర్సీబీకి ఘోర పరాజయం

ఆర్సీబీకి ఘోర పరాజయం

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్​ ఎంచుకుంది. బ్యాటింగ్ ​చేపట్టిన ఢిల్లీ 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్‌( 53 నాటౌట్‌; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 3 […]

Read More

గవాస్కర్​జీ ఏంటా మాటలు! అనూష్క ఫైర్​

మాజీ క్రికెట​ర్​ సునీల్​ గవాస్కర్​పై టీంఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ భార్య ప్రముఖ హీరోయిన్​ అనూష్య శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్​ వైఫల్యాల సమయంలో క్రికెటర్ల భార్యలపై నిందలు మోపడం సరికాదని.. ద్వందార్థాలు వచ్చేలా అసభ్యంగా మాట్లాడం సరికాదని అనూష్క వ్యాఖ్యానించారు. ఇంతకూ గవాస్కర్​ తన కామెంట్రీలో ఏమన్నారు.. ‘ఏ క్రికెటర్​ అయినా ఎంత ఎక్కువ ప్రాక్టీస్​ చేస్తే అంత మెరుగవుతాడు. కానీ కోహ్లీ మాత్రం లాక్​డౌన్​ సమయంలో ఆయన భార్యతోనే ప్రాక్టీస్​ చేసినట్టున్నాడు. […]

Read More
కోహ్లీతో పోల్చవద్దు

కోహ్లీతో పోల్చవద్దు

కరాచీ: బ్యాటింగ్ విషయంలో పదేపదే తనను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోల్చడం సరైంది కాదని పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్​ బాబర్ ఆజమ్ అన్నాడు. ఏ విషయంలోనైనా తనను పాకిస్థాన్ దిగ్గజాలతో పోలిస్తే సంతోషిస్తానన్నాడు. ‘మీరు నన్ను మరెవరితోనైనా పోల్చాలనుకుంటే పాక్ ఆటగాళ్లతోనే పోల్చండి. ఎందుకంటే మియాందాద్, యూనిస్ ఖాన్, ఇంజమామ్​ లాంటి దిగ్గజాలు మాకూ ఉన్నారు. వాళ్లతో పోలిస్తే నా ఘనతలకు సరైన గుర్తింపు వస్తుంది. నేను కూడా బాగా గర్వపడతా. ప్రపంచ క్రికెట్ […]

Read More
వావ్.. కోహ్లీ

వావ్.. కోహ్లీ

న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో అత్యంత మెరుగైన ఫిట్​నెస్ కలిగిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తన ఫిట్​నెస్​ను కాపాడుకోవడానికి చేసే కసరత్తులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. కరోనా లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన విరాట్.. కసరత్తులు మాత్రం మానలేదు. అతను చేసే కొత్త రకం ఎక్సర్​సైజ్​లకు సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాడు. తాజాగా అతను పోస్ట్ చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఎగురుతూ పుష్ అప్స్ చేసే క్రమంలో నేలను తాకక ముందే […]

Read More

కోహ్లీలో నిజాయితీ ఎక్కువ

న్యూఢిల్లీ: అవసరమైనప్పుడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తా, సామర్థ్యం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్నాయని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. దానికి తగినట్లుగానే విరాట్​ ఆటతీరును పూర్తిగా మార్చేసుకుంటాడన్నాడు. ఏ మ్యాచ్ అయినా నిజాయితీగా ఆడటమే కోహ్లీ అతిపెద్ద బలమని చెప్పాడు. ‘కోహ్లీలో నాకు నచ్చిన అంశం ఆటపై అతనికి ఉన్న పట్టుదల, ఆసక్తి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఉండాలనుకుంటాడు. దానికోసం ఎంతకైనా శ్రమిస్తాడు. ఇంతలా కష్టపడే క్రికెటర్​ను నేను ఎప్పుడూ చూడలేదు. […]

Read More
భారత్​కు టెస్టులు ఆడడం నా అదృష్టం

భారత్​కు టెస్టులు ఆడడం నా అదృష్టం

న్యూఢిల్లీ: సమయం వచ్చినప్పుడల్లా టెస్ట్ క్రికెట్​పై తన అభిమతాన్ని చాటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. టెస్టులకు ఉండే విలువ ఏ ఫార్మాట్​కు ఉండదని స్పష్టం చేశాడు. ‘మెరిసే తెల్లని దుస్తులతో ఎర్రబంతితో క్రికెట్ ఆడడం నా అదృష్టం. ముఖ్యంగా ఈ ఫార్మాట్​లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం మరింత గర్వపడే అంశం. దీని దరిదాపుల్లోకి ఏదీ రాదు. టెస్ట్ క్రికెటే నిజమైన ఆట. అందుకే ఈ ఫార్మాట్​కు మరింత ప్రాచుర్యం […]

Read More

సొంత మార్గాన్ని వెతుక్కోండి: కోహ్లీ

న్యూఢిల్లీ: పెద్దవాళ్లు భౌతికంగా దూరమైనప్పటికీ.. తమ పిల్లల్ని పైనుంచి చూస్తూనే ఉంటారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అదే సమయంలో జీవితంలో ముందుకు సాగడానికి మనకంటూ ఓ సొంత మార్గాన్ని ఎంచుకోవాలన్నాడు. ‘ఫాదర్స్’ డే సందర్భంగా చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ‘కుటుంబాన్ని, తల్లిదండ్రులను ప్రేమించండి. మీ తండ్రి మీపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతతో ఉండండి. మీ కంటూ ఓ మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగండి. మీరెప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన […]

Read More