Breaking News

KCR

కేటీఆర్​ కుమారుడు హిమాన్ష్​కు గాయాలు!

సీఎం కేసీఆర్​ మనవడు, కేటీఆర్​ కుమారుడు కల్వకుంట్ల హిమాన్ష్​కు గాయాలైనట్టు సమాచారం. ఆయన ఎడమకాలు, తుంటి వద్ద గాయం కావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్పించారు. అయితే కాలు విరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హిమాన్ష్​ గుర్రం స్వారీ చేస్తుండగా కిందపడ్డాడని సమాచారం. హిమాన్ష్​ తన ఇంట్లోని బాత్​రూంలో జారిపడ్డారని మరికొందరు చెబుతున్నారు. అవన్నీ రూమర్స్​ నాకేం కాలేదు! ఈ వార్తలపై హిమాన్ష్​ స్పందించారు. ‘ నాకు కాలు విరిగిందని.. నడవలేకపోతున్నానని కొన్ని వార్తా పత్రికలు రాశాయి. అవన్నీ […]

Read More

చంద్రబాబుకు బిగ్​షాక్​.. గల్లా రాజీనామా!

సారథిన్యూస్​, అమరావతి: సీనియర్​ రాజకీయనేతను అని చెప్పుకొనే చంద్రబాబుకు ఈ మధ్య షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే పార్టీకి కూడా గుడ్​బై చెప్పనున్నట్టు సమాచారం. అరుణకుమారి సుధీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. విభజన అనంతరం ఆమె టీడీపీలో చేరారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్​ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు […]

Read More

ఎల్ఆర్ఎస్ పేదలకు శాపం

సారథి న్యూస్, రామడుగు/ రామాయంపేట /చిన్నశంకరంపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పేద ప్రజలకు గుదిబండ అని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు మురళి విమర్శించారు. ఎల్​ఆర్​ఎస్​ను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ పేరుతో తీసుకొచ్చిన జీవో 131 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. మరోవైపు ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని డిమాండ్​ […]

Read More

దుబ్బాకలో ఎన్నికల సందడి

నోటిఫికేషన్ రాక ముందే రాజకీయ వేడి మండలాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల హాడావిడి బీజేపీ నేతల మకా..గాడిన పడని కాంగ్రెస్ పల్లెల్లో నేతల మోహరింపు సారథి న్యూస్, దుబ్బాక: రాజకీయ పార్టీలు అధికారికంగా తమ అభ్యర్థులను ప్రకటించకముందే దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం ముమ్మరమైంది. ఎవరికి వారే అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకున్నా స్థానికంగా మాత్రం రాజకీయ సందడి నెలకొన్నది. ఇప్పటికి ఎన్నికల ప్రకటన సైతం వెలువడలేదు […]

Read More

విద్యుత్​షాక్​తో యువకుడు మృతి

సారథి న్యూస్​, గద్వాల: విద్యుత్​షాక్​తో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం తుమ్మలచెరువులో చోటుచేసుకున్నది. యువకుడు తన పొలానికి నీరు పెట్టుకుంటుండగా.. పొలం వద్ద ట్రాన్స్​ఫారం పోయింది. దీంతో లైన్​ ఆఫ్​చేసి జంపర్​ వేస్తుండగా ప్రమాదవశాత్తు మెయిన్​వైర్​కు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Read More

కొత్తచట్టంతో కబ్జాలకు చెక్​

సారథి న్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్​ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూచట్టంతో భూకబ్జాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు, అధికారుల అవినీతికి చెక్​ పడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఆదివారం రామగుండం, పాలకుర్తి, అంతర్గాం నుంచి గోదావరిఖని జవహార్​ లాల్​ నెహ్రూ స్టేడియం వరకు ర్యాలీ 500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే చందర్​, ఎంపీ వెంకటేశ్​ నేతకాని ప్రారంభించారు. ర్యాలీలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, […]

Read More

ఐలమ్మ ఆదర్శ మహిళ

సారథిన్యూస్, రామాయంపేట / చేవెళ్ల: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆదర్శమహిళ అని పలువురు వక్తలు కొనియాడారు. ఆమె పోరాట పటిమను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని పలుచోట్ల ఆమెకు నివాళి అర్పించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో రజక సంఘం అధ్యక్షులు సంగుస్వామి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. మరోవైపు చేవెళ్ల మండల కేంద్రంలో రజకసంఘం, కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో ఐలమ్మ […]

Read More

కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని కార్మికసంఘాల నాయకులు ఆరోపించారు. శనివారం జీడీకే 1, 2, 2 ఏ, 11 గని తదితర విభాగాల్లో సీఐటీయూతో పాటు వివిధ కార్మికసంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికులను ఉత్పత్తి సాధనాలుగా వాడుకుంటున్నదని ఆరోపించారు. కార్మికుల బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో కార్మికసంఘం నేతలు మల్లికార్జున్, పార్లపల్లి […]

Read More