Breaking News

KAMMAM

కరోనా వచ్చిందంటూ దుష్ప్రచారం

సారథిన్యూస్​, ఖమ్మం: కరోనా వచ్చిందంటూ తనపై సాక్షాత్తూ ఖమ్మం డీఎమ్​హెచ్​వో డాక్టర్​ మాలతి దుష్ప్రచారం చేశారని జిల్లాకు చెందిన డాక్టర్​ శంకర్​నాయక్​ జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. డీఎమ్​హెచ్​వోపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ కావాలని తనకు పాజిటివ్​ వచ్చందంటూ రిపోర్టులు మార్చి కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్​ చేశారని మండిపడ్డారు. తన కరోనా నెగెటివ్​ వచ్చన రిపోర్టులను శంకర్​నాయక్​ కలెక్టర్ కు చూపించారు. డీఎంఅండ్​హెచ్​వో పనితీరు సక్రమంగా లేదని ఆమె […]

Read More

గంజాయి పట్టివేత

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో పోలీసులు 21 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Read More

రెవెన్యూశాఖలో భారీగా అక్రమాలు

సారథిన్యూస్​, ఖమ్మం: రెవెన్యూశాఖ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారని గోండ్వానా సంక్షేమపరిషత్​ నాయకుడు విద్యాసాగర్​ ఆరోపించారు. గురువారం ఆయన ఖమ్మం జిల్లా కోయవీరాపురంలో పర్యటించి ప్రజల భూసంబంధిత సమస్యలు తెలుసుకున్నారు. ఆదివాసి గ్రామమైన కోయవీరాపురం రెవెన్యూ అధికారుల అక్రమాలతో కొట్టుమిట్టాడుతున్నదని చెప్పారు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. రెవెన్యూ అధికారులు చట్టాన్ని అమలుచేయడం లేదన్నారు. ఆయనవెంటన గిరిజనసంఘం నాయకులు చాప శాంతమ్మ, సోడి రాంబాయి, పీర్ల చెన్నమ్మ తదితరులు […]

Read More

టీఆర్​ఎస్​తోనే అభివృద్ధి

ఖమ్మం: టీఆర్​ఎస్​ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలోని 41, 43వ డివిజన్ మిర్చి మార్కెట్ రోడ్ లో రూ.కోటితో నిర్మించిన డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్ పనులను మేయర్ పాపాలాల్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ అనురాగ్​ జయంతి, కార్పొరేటర్​, మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.

Read More

సొంత నిధులతో రైతు వేదిక

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రాష్ట్రానికే ఆదర్శనీయంగా రైతు వేదిక నిర్మిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. రైతు వేదిక నిర్మాణపనులను బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ రైతు వేదికను మంత్రి అజయ్​ రూ.40 లక్షలు సొంత నిధులు వెచ్చించి నిర్మిస్తున్నారు. మంత్రి వెంట కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​, ఎమ్మెల్సీ బాలసాని, రైతుబంధు జిల్లా కన్వీనర్​ నల్లమల వెంకటేశ్వరరావు, ఏఎమ్సీ చైర్మన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Read More

వీరుడా.. వందనం

సారథి న్యూస్, రామడుగు/ఖమ్మం: చైనా శత్రు మూకల దాడిలో అసువులు బాసిన వీర జవాన్లకు రామడుగులోని అంబేద్కర్​ విగ్రహం వద్ద విద్యావంతులవేదిక ఆధ్వర్యంలో గురువారం కొవ్వత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో అమర జవాన్లకు నివాళి అర్పించారు.

Read More

సంతోష్​ త్యాగం మరువలేనిది

సారథిన్యూస్​, ఖమ్మం: భారత్​-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన కల్నల్​ సంతోష్​బాబు త్యాగం మరువలేనిదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జెడ్పీ సమావేశమందిరంలో సంతోష్​బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అజయ్​ మాట్లాడుతూ.. సంతోష్​బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

అభివృద్ధి పథంలో మధిర

సారథిన్యూస్​, ఖమ్మం: మధిర నియోజకవర్గం అభివృద్ధిపథంలో కొనసాగుతున్నదని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా మధిర అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పరుగులు పెడుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​ నాయకులు రావూరి శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, మొండితోక జయకర్, బిక్కి ప్రసాద్, రంగిశెట్టి కోటేశ్వరరావు, భరత్ వెంకటరెడ్డి, అరిగే శ్రీను వైవీ అప్పారావు, ఇక్బాల్ కొటారి రాఘవరావు, కనుమూరు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Read More