Breaking News

KAMMAM

ఖమ్మంలో యాంటీజెన్​ టెస్టులు

సారథిన్యూస్​, ఖమ్మం: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో రాపిడ్​ యాంటిజెన్​ టెస్టులు చేస్తున్నారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్​ ఖమ్మంలో ర్యాపిడ్​ యాంటిజెన్​ టెస్టుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు 10 వేల ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్న వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్​ ఆర్వీ […]

Read More

మావోయిస్టుల పేరుతో బెదిరింపు

సారథిన్యూస్​, ఖమ్మం: మావోయిస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ఓ ముఠాగా ఏర్పడి మావోయిస్టుల మంటూ సింగరేణి మహాలక్ష్మి క్యాంప్​ హెచ్​ఆర్​ మేనేజర్​కు ఫోన్​చేసి డబ్బులు డిమాండ్​ చేశారు. దీంతో మేనేజర్​ వారికి డబ్బులు ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు సదురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read More

మొక్కలు నాటడం మన బాధ్యత

సారథిన్యూస్​, ఖమ్మం: మొక్కలు నాటడం మనందరి బాధ్యత అని ఖమ్మం పోలీస్​ కమిషనర్​ తఫ్సీర్​ ఇక్బాల్​ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో కమిషనర్​ క్యాంప్​ కార్యలయంలో ఇక్చాల్​ కుటుంబసభ్యలు ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్​ మాట్లాడుతూ.. మొక్కలు నాటడమే కాక వాటిని బతికించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో తఫ్సీర్ ఇక్బాల్ తనయుడు తైముర్ ఇక్బాల్ , కమిషనర్ సతీమణి జెబాఖానమ్ పోలీస్​ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి అజయ్​

రైతు వేదికలు దేశానికే తలమానికం

సారథిన్యూస్​, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికే తలమానికమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు, వారికి ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించేందుకే సీఎం కేసీఆర్​ రైతువేదికలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లింగాల […]

Read More

ఖమ్మం టీఆర్​ఎస్​ ఆఫీస్​ ఇంచార్జిగా కృష్ణ

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయం ఇంచార్జిగా ఆర్​జేసీ కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ గురువారం నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణను మంత్రులు కేటీఆర్​, అజయ్​ అభినందించారు. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.

Read More

ఖమ్మంలోనే కరోనా పరీక్షలు

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన కరోనా అనుమానితలు పరీక్షల కోసం ఇకనుంచి హైదరాబాద్​ వెళ్లాల్సిన అవసరం లేదని.. త్వరలో ఖమ్మం జిల్లాకేంద్రంలోనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ పేర్కొన్నారు. ఖమ్మంలో కరోనా పరీక్షలు చేయాలంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్​ను కోరగా అందుకు ఆయన అనుమతించారని చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్​ తెలిపారు. […]

Read More

నిఘా నీడలో..

సారథిన్యూస్​, ఖమ్మం : మావోయిస్టుల కదలికల నేఫథ్యంలో.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీపురంలో మంగళవారం భారీ బందోబస్తు నడుమ గ్రీన్​ఫీల్డ్​ సర్వే నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు బందోబస్తులో పాల్గన్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, కల్లూరు ఏసీపీ వెంకటేశ్​, వైరా సీఐ వసంత కుమార్, తల్లాడ వైరా, కల్లూరు ఎస్సైలు తిరుపతిరెడ్డి, సురేశ్​, రఫీ ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. తల్లాడ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు బలగాలతో పొలాల్లో చేల గట్లపై బురదలో నడుచుకుంటూ సర్వేకు […]

Read More

పీవీ.. గొప్ప రాజనీతిజ్ఞుడు

సారథి న్యూస్​, ఖమ్మం, రామడుగు,చొప్పదండి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్​లో మంత్రి పువ్వాడ అజయ్​, జడ్పీ చైర్మన్​ లింగాల కమల్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని పీవీ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్​లో […]

Read More