Breaking News

JAIPUR

మరోసారి సుప్రీంకోర్టుకు

న్యూఢిల్లీ: గత రెండు వారాలుగా అనేక మలుపులు తిరుగుతున్న రాజస్థాన్‌ రాజకీయం రెండోసారి సుప్రీం కోర్టుకు చేరింది. సచిన్‌ పైలెట్‌, 19 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి యాక్షన్‌ తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్‌ స్పీకర్‌‌ సీపీ జోషీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ముగ్గురు జడ్జిల బెంచ్‌ సోమవారం దాన్ని విచారించనున్నారు. ఈ పిటిషన్‌ను విచారించనున్నట్లు శనివారం సాయంత్రం రిలీజ్‌ చేసిన లిస్ట్‌లో ఉంది. […]

Read More

హైకోర్టులోనూ పైలట్​కే అనుకూలం

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సచిన్​ పైలట్​కు హైకోర్టులో మరోసారి ఊరట దక్కింది. సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై రాజస్థాన్ స్పీకర్​ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై పైలట్​ ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. గురువారం దీనిపై కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. ఈ క్రమంలో ఈకేసులో కేంద్రాన్ని కూడా చేర్చాలంటూ పైలట్​ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిని కోర్టు స్వీకరించింది. ఈ కేసులో తుదితీర్పు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఎమ్మెల్యేల అనర్హత […]

Read More

కాంగ్రెస్​ ఎమ్మెల్యేల అంత్యాక్షరి

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. సీఎం అశోక్​ గెహ్లాట్​ మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సచిన్​ పైలట్​కు అనుకూలంగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే కాంగ్రెస్​ అధిష్ఠానం వేటు వేసింది. మరోవైపు అశోక్​గెహ్లాట్​కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్​ జైపూర్​లోని ఫెయిర్​మౌంట్​లో ఉంచింది. ఈ క్రమంలో ఆదివారం సరదాగా కొందరు ఎమ్మెల్యేలు అంత్యాక్షరి ఆడుతూ కనిపించారు. మరికొందరు తంబోలా ఆడుతూ, టీవీ చూస్తూ […]

Read More

ఆడియో టేపులపై సీబీఐ విచారణ

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్​ షేకావత్​ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. గజేంద్రసింగ్​ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న ఓ ఆడియోను విడుదల చేసింది కాంగ్రెస్​ పార్టీ. అయితే ఆ వాయిస్​ తనది కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆడియోటేపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలనీ బీజేపీ నేత సంబిత్​ పాత్రా డిమాండ్​ చేశారు.

Read More

ఆడియో క్లిప్పులతో దొరికిపోయారు

జైపూర్‌‌: రాజస్థాన్‌ పొలిటికల్‌ డ్రామా రోజుకో మలుపు తిరుతున్నది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనాలని చూస్తోందని ఆరోపించిన కాంగ్రెస్‌, 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్‌ మరో ముందు అడుగు వేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాలు ఆడారని ఆరోపిస్తూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షకావత్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భన్వర్‌‌లాల్‌ శర్మపై కేసు పెట్టింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడు పోయారని విచారణలో వెల్లడైందని చెప్పింది. బీజేపీతో డీలింగ్‌ పెట్టుకున్నారని ఆడియో […]

Read More

బీజేపీలో చేరడం లేదు

న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరడం లేదని.. కాంగ్రెస్​ బహిష్కృత నేత సచిన్​ పైలట్​ స్పష్టం చేశారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో కాంగ్రెస్​పార్టీ అతడిపై వేటు వేసింది. పీసీసీ అధ్యక్షపదవి నుంచి, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది. దీంతో సచిన్​ పైలట్​ ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన భవిష్యత్​ కార్యాచరణపై త్వరలోనే ఓ ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సరైన […]

Read More

రాజస్థాన్​లో ఏం జరుగుతోంది?

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయం రసకందాయంలో పడింది. ఓ వైపు డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ పార్టీపై తిరుగుబాటు చేయగా.. మరోవైపు కాంగ్రెస్​ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు రణ్​దీప్​ సూర్జేవాలా, అజయ్​ మకెన్​లు జైపూర్​కు చేరుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అశోక్​ గెహ్లాట్​కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు. అయితే సచిన్​ పైలట్​ వెంట ఎంతమంది ఉన్నారు.. అతడి వ్యూహం […]

Read More