న్యూఢిల్లీ : కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 76,472 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 34,63,973 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 1,021 మంది కరోనాతో మృతిచెందారు. కాగా ఇప్పటివరకు మృతిచెందిన వారిసంఖ్య 62,550కు చేరింది. కోలుకుంటున్న వారిసంఖ్య కూడా అధికంగానే ఉంది. వైరస్ బారినపడ్డ వారిలో ఇప్పటివరకు 26,48,999 మంది కోలుకున్నారు. భారత్‌లో ప్రస్తుతం 7,52,424 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితేనే బయటకు రావాలని కేంద్ర […]
సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: కరోన తీవ్రత కొనసాగుతోంది. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్సీలో గురువారం 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్యఅధికారులు సూచిస్తున్నారు. కొంతమంది అజాగ్రత్త వల్ల మిగతావారు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు.
కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతిఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని తీసుకుంటే మరింత శక్తి పెరుగుతుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొన్ని పదార్థాలను మామూలుగా తినేకంటే.. నానబెట్టి క్రమం తప్పకుండా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుని ట్రై చేసి చూడండి.మెంతులురెండు చెంచాల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటిని తాగాలి. రోజూ ఇలా చేయడం వల్ల కీళ్లనొప్పులు తగ్గుతాయి. వీటిలో పీచు అధికంగా […]
కరోనా వైరస్బారినపడకుండా ఉండేందుకు అందరికీ ఫేస్‌మాస్క్‌లు పెట్టుకోవడం అలవాటైంది. అయితే ఫేస్ మాస్క్‌లో పేరుకుపోయే దుమ్ము, ధూళి, చెమట కారణంగా చాలామంది మొటిమలు వస్తున్నాయి. అలాగే చేతులు కడగడం వల్ల పొడిబారడం వంటి సమస్యలూ వస్తున్నాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.తరచూ చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, రోజూ ఫేస్మాస్క్పెట్టుకోవడం అందరికీ ఇటీవల అలవాటైన పనులు. ఇవి వైరస్ నుంచి కాపాడుతున్నాయి కరెక్టే. కానీ చాలామందికి వీటివల్ల స్కిన్ఇన్ఫెక్షన్లు […]
చెన్నై: గాన గాంధర్వుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన కుమారుడు చరణ్ తెలిపారు. కరోనాతో ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చేరిన బాలూ ఆరోగ్యం క్రమంగా క్షీణించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఎక్మా పరికరంతో కృత్రిమశ్వాసం అందిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలోని బాలు అభిమానులు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందారు. ఆయన తొందరగా కోలుకోవాలని మృత్యుంజయ యాగాలు, హోమాలు, పూజలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం […]
ఢిల్లీ: భారత్‌లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,67,323 కు చేరుకుంది. ఇప్పటివరకు 24 లక్షల మంది కోలుకోగా.. ఏడు లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 848 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 58,390కు చేరింది. అయితే ప్రస్తుతం పాజిటివిటీ రేటు 8.6 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు […]
చెన్నై: కరోనాతో బాధపడుతూ చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం కోలుకుంటున్నారని.. ఆయనకు కరోనాకు నెగిటివ్ వచ్చిందని సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే ఈ వార్త పూర్తిగా అవాస్తవమని ఆయన కుమారుడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ చరణ్ తేల్చిచెప్పారు. ఆయన ఆరోగ్యం ఇంకా విషయమంగానే ఉన్నదని పేర్కొన్నారు. ‘ నాన్నగారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఆరోగ్యంపై ఏ విషయమైనా […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి భయంకరంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 61,408 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 31,06,349 కు చేరుకుంది. తాజాగా 836 మంది వైరస్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 57,542 కు చేరింది. 57,468 మంది కోవిడ్ పేషంట్లు ఆదివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 23,38,036 కు చేరింది. ప్రస్తుతం 7,10,771 యాక్టివ్ కేసులున్నాయి. ఈ […]