Breaking News

కరోనాలో స్కిన్​ కేర్​

కరోనాలో స్కిన్​కేర్​

కరోనా వైరస్​బారినపడకుండా ఉండేందుకు అందరికీ ఫేస్​మాస్క్​లు పెట్టుకోవడం అలవాటైంది. అయితే ఫేస్ మాస్క్‌లో పేరుకుపోయే దుమ్ము, ధూళి, చెమట కారణంగా చాలామంది మొటిమలు వస్తున్నాయి. అలాగే చేతులు కడగడం వల్ల పొడిబారడం వంటి సమస్యలూ వస్తున్నాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
తరచూ చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్ రాసుకోవడం, రోజూ ఫేస్​మాస్క్​పెట్టుకోవడం అందరికీ ఇటీవల అలవాటైన పనులు. ఇవి వైరస్ నుంచి కాపాడుతున్నాయి కరెక్టే. కానీ చాలామందికి వీటివల్ల స్కిన్​ఇన్​ఫెక్షన్లు వస్తున్నాయి. అందువల్ల హెల్త్​కేర్​తో పాటు స్కిన్​కేర్​ కూడా ముఖ్యమని తెలుసుకోవాలి.
మాస్క్​ క్లీన్ ​కంపల్సరీ
డిస్పోజబుల్​మాస్కులు వాడుతున్నట్లయితే ఎప్పటికప్పుడు వాటిని రీప్లేస్ చేయాలి. అదే క్లాత్​మాస్క్​లేదా స్కార్ఫ్​లు పెట్టుకుంటున్నట్లయితే ఉతకడం, ఆరబెట్టడం చేయాలి. అలాగే కొందరికి త్వరగా స్కిన్​ప్రాబ్లమ్స్​ వస్తుంటాయి. అలాంటి వాళ్లు తమ స్కిన్​కు ఫ్రెండ్లీగా ఉండేలా క్లాత్​మాస్క్​లేదా స్కార్ఫ్​ను ఉపయోగించాలి. అలాగే వాటిని యాంటీ సెప్టిక్​ లిక్విడ్స్​తో వాష్​చేయాలి.
రెగ్యులర్ ​హ్యాండ్​వాష్
బయటకు వెళ్లొచ్చిన ప్రతిసారీ చేతులు, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తేనే మొటిమలు వంటి చర్మ సమస్యలు తగ్గించుకోవచ్చు. దీంతోపాటు వైరస్​బారినపడే ప్రమాదాలు చాలా మేరకు తగ్గుతాయి.

మాయిశ్చరైజర్ వాడాలి
చేతులను తరచూ కడుక్కోవడం, ఎక్కువగా శానిటైజర్ ​రాసుకోవడం ద్వారా చేతులు పొడిబారుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ లేదా హ్యాండ్ క్రీమ్ వాడితే చర్మం హైడ్రేట్​అవుతుంది.
హైడ్రేటింగ్ లిప్​బామ్
ఫేస్​మాస్క్​లను రెగ్యులర్​గా పెట్టుకోవడం వల్ల పెదాలు వాడిపోతాయి. అలాగే హ్యాండ్​వాష్​చేసుకున్న ప్రతిసారీ పెదాలను కూడా కడుగుతుంటారు. కాబట్టి లిప్​బామ్​ను తరచూ రాసుకుంటూ హైడ్రేట్​ చేసుకోవాలి. అప్పుడే పెదాలు ఎర్రగా మెరుస్తుంటాయి.