Breaking News

HARISHRAO

ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూత

నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కన్నుమూత

తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేసిన సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్, హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మార్క్సిస్టు దృక్పథంతో ప్రజాసమస్యలపై పాలకులను నిలదీసిన నాగార్జునసాగర్​ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య(64) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండగా వెంటనే హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. నోముల 30ఏళ్లకు పైగా రాజకీయ, ప్రజాజీవితంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. 1987లో జరిగిన మండల […]

Read More
బీజేపీకి సిద్ధాంతం లేదు.. రాద్ధాంతమే

బీజేపీకి సిద్ధాంతం లేదు.. రాద్ధాంతమే

సారథి న్యూస్, హైదరాబాద్: బీజేపీకి ఒకప్పుడు సిద్ధాంతం ఉండేదని, ఇప్పుడది అబద్ధాలతో రాద్ధాంతం చేసే పార్టీగా మారిందని మంత్రి టి.హరీశ్​రావు ఎద్దేవాచేశారు. గోబెల్స్ ప్రచారంతో అబద్ధాల పునాదుల మీద బీజేపీ రాజకీయంగా ఎదగాలని అనుకుంటోందని, ఆ వ్యవహారశైలిని టీఆర్ఎస్​ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం పటాన్ చెరులో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ ​నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి హరీశ్​రావు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని ఓట్లు వేయాలని సూటిగా ప్రశ్నించారు. 70ఏళ్ల […]

Read More
4 కేజీబీవీలకు రూ.14 కోట్లు మంజూరు

4 కేజీబీవీలకు రూ.14 కోట్లు మంజూరు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బాగాంధీ(కేజీబీవీ) బాలికల స్కూళ్ల భవనాల నిర్మాణాలకు రూ.14 కోట్లు మంజూరైనట్లు మంత్రి టి.హరీశ్​ రావు తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలను మంజూరు చేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం తొగుట, రాయ్ పోల్ మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం, జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలంలోని కస్తూర్బా బాలికల […]

Read More
ఓటమికి కుంగిపోం: మంత్రి కేటీఆర్​

ఓటమికి కుంగిపోం: మంత్రి కేటీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: విజయాలకు పొంగిపోయేది లేదని, అపజయాలకు కుంగిపోవమని మంత్రి, టీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​కె.తారక రామారావు అన్నారు. అప్పుడు.. ఇప్పుడు ఇదే చెబుతున్నామని అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటువేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావుతో పాటు మిగతా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘తాము ఆశించిన ఫలితం రాలేదు.. ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది. […]

Read More
‘దుబ్బాక’ కౌంటింగ్​ కు రెడీ

దుబ్బాక.. కౌంట్​ డౌన్​

సారథి న్యూస్, దుబ్బాక: ఈనెల 10న నిర్వహించనున్న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీమతి భారతి హోళీకేరి ఆదేశాల మేరకు కౌంటింగ్ కేంద్రం వద్ద అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బ్రాండ్‌బ్యాండ్‌ ఇంటర్​నెట్​ సౌకర్యంతో పాటు వీడియోగ్రఫీ చేస్తున్నామని చెప్పారు. కౌంటింగ్‌ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత […]

Read More
దుబ్బాకలో 81.44శాతం పోలింగ్

దుబ్బాకలో 82.61 శాతం పోలింగ్

సారథి న్యూస్, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్‌ మంగళవారం ముగిసింది. 82.61 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 6గంటల లోపు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86.24శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ ​శాతం తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, […]

Read More
సుజాతక్క, మేం ప్రజల వైపే ఉంటాం

సుజాతక్క, మేం ప్రజల వైపే ఉంటాం

సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలోని రెడ్డి సంఘం భవన్ లో గురువారం ఆటో యూనియన్ ఏర్పాటుచేసిన సంఘీభావ సభలో మంత్రి టి.హరీశ్​రావు మాట్లాడారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చనిపోవడం బాధాకరన్నారు. తెలంగాణ మొత్తం ఇప్పుడు దుబ్బాక వైపు చూస్తోందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తాను, కాబోయే ఎమ్మెల్యే సుజాతక్క ప్రజల వైపే ఉంటామన్నారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడడం పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్ రెడ్డికి తగదన్నారు. భేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. […]

Read More
దుబ్బాకలో త్రిముఖ పోరు

దుబ్బాకలో త్రిముఖ పోరు

టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్​ సారథి న్యూస్, దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ప్రముఖంగా త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఎవరికివారు బలనిరూపణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో ఎలాగైనా గెలవాలని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రపోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తన […]

Read More