డాక్టర్బీఆర్అంబేద్కర్ అద్భుతమైన రచన చేశారు కరోనా వ్యాక్సిన్ అందరూ తీసుకోవాల్సిందే రాజ్‌భవన్ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళసై సామాజిక సారథి, హైదరాబాద్: రాజ్యాంగం వల్లే భారత్బలంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కోవిడ్ సంక్షోభ సమయంలో ఆన్లైన్ విద్య లైఫ్ లైన్ గా మారిందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. కరోనా విద్యాభ్యాసాన్ని ఆటంక పరిచినప్పటికీ, ఆన్ లైన్ పద్ధతులు, టెక్నాలజీతో చదువును కొనసాగించవచ్చని అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ ఆధ్వర్యంలో ‘ఆన్ లైన్ విద్యావకాశాలు, సవాళ్లు’ అనే అంశంపై గవర్నర్ మంగళవారం ప్రారంభోపన్యాసం చేశారు. టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలు అట్టడుగు వర్గాలకు చేరాలన్నారు. ఆన్ లైన్ విద్యతో […]
పాలనలో తప్పులు ఎత్తిచూపే వారిని వేధిస్తున్నారు పవర్‌హౌస్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కు శనివారం లేఖ రాశారు. ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రజలకు గవర్నర్ హోదాలో మీరు ఇటీవల స్పందించిన తీరు కొంత ఊరట కలిగించిందన్నారు. లేఖలోని ముఖ్యాంశాలు.. ‘రాష్ట్రంలో రాజ్యాంగ, పౌర, […]
చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తున్నది. తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కరోనా సోకింది. దీంతో ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం గవర్నర్ భన్వరిలాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇటీవల గవర్నర్‌ను కలిసిన వారంతా హోం క్వారంటైన్‌కు వెళ్లారు.
సారథిన్యూస్, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం ఆశయాలు కొనసాగిద్దామని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కలాం ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమిళనాడులోని కలాం బంధువులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ గవర్నర్‌తో కలిసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని కాంగ్రెస్ విమర్శించగా.. బీజేపీ ఆ ఆరోపణలను తిప్పికొట్టింది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం వైపు నడుస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాతో శనివారం బీజేపీ డెలిగేషన్ భేటీ అయింది. అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ను రాజ్యాంగ పరంగా పనిచేయకుండా కాంగ్రెస్ నేతలు […]
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ (85) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు అశుతోష్ ట్వీట్‌చేశారు. ఆయన కొంతకాలంగా జ్వరం, మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. నెల క్రితం లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. టాండన్ మాజీ ప్రధాని వాజపేయికి సన్నిహితుడు. ఉత్తర్‌ప్రదేశ్ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. చిన్నప్పటినుంచే టాండన్ ఆరెస్సెస్‌లో క్రియాశీలకంగా ఉండేవారు. తర్వాత జనసంఘ్‌లో చేరారు. టాండన్ మృతికి ప్రధాని మోదీ, కేంద్రమత్రి స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్ ను సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్ భవన్ లో కలిశారు. హైదరాబాద్ మహానగరంలో బోనాల పండుగ శుభసందర్భంగా కలిసి బొకే అందజేశారు. అమ్మవారిని పూజించి కరోనా వైరస్ నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని వేడుకోవాలని గవర్నర్‌ను కోరారు.