సారథి న్యూస్, రామగుండం: టీఆర్ఎస్ కార్యకర్త ఎంఎన్ శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసా ఇచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గుంటూరుపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ఓదార్చారు. ఆత్మహత్యకు పాల్పడిన శివారెడ్డి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మృతుని కుమార్తెకు వైద్యసదుపాయం కల్పిస్తామని భరోసా కల్పిస్తామన్నారు.
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం కాకుండా కాపాడుకుందామని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీవన్ ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్మికహక్కులను కాపాడుకొనేందుకు ప్రతి కార్మికుడు ఉద్యమించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గుపరిశ్రమలను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మెండె శ్రీనివాస్, నంది నారాయణ, బీ రవి, మెండయ్య, ఓదెలు, […]
సారథిన్యూస్ రామగుండం: కరోనా మహమ్మారి ఓ యువ జర్నలిస్టును బలి తీసుకున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాంచందర్ ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా శ్వాససంబంధిత ఇబ్బందితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కరీంనగర్ దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం కన్నుమూశాడు. రాంచందర్ మృతికి గోదావరిఖని ప్రెస్ క్లబ్ నాయకులతోపాటు సీనియర్ జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు.
సారథి న్యూస్, రామగుండం: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకోవడానికి కార్మిక సంఘాలు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపులో భాగంగా ఆదివారం గోదావరిఖని చౌరస్తా లో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాయి. సీఐటీయూ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మెండ శ్రీనివాస్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి నరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. కరోనా కారణంగా నష్టపోతున్న ఆటో, లారీ, భవన నిర్మాణ, హమాలీ, క్వారీ తదితర రంగాల కార్మికులను […]
సారథిన్యూస్, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి చేతుల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. పెద్దపల్లి జిల్లాకు చెందని ఓ మహిళ రాఖీ పౌర్ణమి పండుగకోసం తన సోదరుడితో కలిసి గోదావరిఖనికి బైక్‌పై వస్తుండగా.. రాజీవ్ […]
సారథి న్యూస్, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న ఓ కార్మికుడు కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో గురువారం సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించారు. సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాజమాన్యం వెంటనే లాక్డౌన్ ప్రకటించాలని సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారయ్య, గని కార్యదర్శి కే రంగారావు కోరారు. సింగరేణి ఆర్జీవన్ డివిజన్లోని జీడీకే రెండవ గనిలో పనిచేస్తున్న టామర్ కార్మికుడు బుధవారం కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో కార్మికవర్గం ఒక్కటైంది.
సారథిన్యూస్, గోదావరిఖని: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల అశాజ్యోతి అని దళితసంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిజర్వేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు.. అంబేద్కర్ విగ్రహానికి, చత్రపతి సాహుమహరాజ్, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటాలకు పూలమాలలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా […]
సారథిన్యూస్, గోదావరిఖని: కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని వామపక్ష నాయకులు ఆరోపించారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. కరోనాను అరికట్టడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య , సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నరేశ్, వామపక్ష నాయకులు తోకల రమేశ్, మహేశ్వరీ, లావణ్య, ఫైముదా, పీర్ మహ్మద్, మోగిలి, ఎం దుర్గయ్య, […]