హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు వణికిపోతున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 1500 కాలనీల్లో నడుముల లోతు మేర వరద నీరు చేరింది. కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రహహిస్తుండడంతో అధికారులు బోట్లు, నాటుపడవల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం మూడు రోజుల వరకు నగరవాసులు బయటకు రావొద్దని హెచ్చరించారు.అత్యవసర సేవల కోసం 040 – 211111111, జీహెచ్ఎంసీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. సోమవారం 30,210 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,021 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,13,084కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఆరుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,228కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 228 కొత్త కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారినుంచి తాజాగా 2,214 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల […]
సారథి న్యూస్, హైదరాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు చేపలను ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒక్కొక్కటి చొప్పున చేపల విక్రయ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ(ఎంపీఈడీఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఇంకా పెరుగుతూనే ఉంది. రోజుకు వందల సంఖ్య కేసులు నమోదవుతున్నాయి. గురువారం(24 గంటల్లో) 1,896 కరోనా పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 2,06,644కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 12 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,201 కు చేరింది. కరోనా నుంచి తాజాగా 2,067 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న బాధితులు 1,79,075 మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ […]
సారథి న్యూస్, ఎల్బీ నగర్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ గుంతలుపడి బురదమయంగా మారాయి. మరమ్మతులు చేపట్టడంలో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టేలా టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం హయాత్నగర్ డివిజన్ పరిధిలోని అన్మగల్, హయత్నగర్ లో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు దాసరమొని శ్రీనివాస్ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ కాలనీ, వెంకటాద్రికాలనీ, సత్యనారాయణ కాలనీల్లో వరి నాట్లు వేసి నిరసన […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ఉధృతి ఎంతమాత్రం తగ్గడం లేదు. తెలంగాణలో శనివారం కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదయ్యయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారిన పడి 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 1,091కు చేరింది. ఇప్పటివరకు 1,52,441 మంది వ్యాధి వారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,334 యాక్టివ్కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 24,683 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒకేరోజు […]
సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ఇళ్లు కట్టామని తాము ఒకచోట చెబితే కాంగ్రెస్నేతలు మరోచోటుకు వెళ్లారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన భీమ్రావు వాడ వివాదం అందరికీ తెలిసిందేనని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయనే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల తీరు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుందిగా ఉందని ఎద్దేవాచేశారు. దేశాన్ని, రాష్ట్రాన్ని […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,137 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరింది. 2,192 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్అయ్యారు. ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 1,39,700కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 8 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా వ్యాధి కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 1,033కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,573 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, శనివారం ఒక్కరోజే 53,811 […]