సారథి, క్రీడలు: క్రీడల్లో మహాసంరంభం.. 52 రోజుల పాటు 60 మ్యాచ్ ల మెగా ఈవెంట్ ఐపీఎల్14వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. సిక్సర్లు, బౌండరీలు దంచికొట్టే బ్యాట్స్మెన్లు, యార్కర్లు, కట్టర్లు, గూగ్లీలు, ప్లిప్పర్లు, క్యారమ్ బౌలింగ్‌తో వారికి అడ్డుకట్ట వేసే బౌలర్లు క్రికెట్‌అభిమానులను మరింత కనువిందు చేయనున్నారు. గతేడాది యూఏఈలో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండేళ్ల తర్వాత భారత్‌లో జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్, విరాట్‌కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఎంఎస్ […]
అబుదాబి: ఐపీఎల్-13 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భలే బోణీ కొట్టింది. షెడ్యూల్ లో భాగంగా శనివారం అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 163 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. జట్టులో బ్యాట్స్‌మెన్ సౌరభ్ తివారీ 42(31), డికాక్ 33(20), పొలార్డ్18(14) […]
కరోనా నేపథ్యంలో వాయిదాపడుతూ వచ్చిన ఐపీఎల్-13వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారం తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత టోర్నీ చాంపియన్ముంబై ఇండియన్స్.. రన్నరప్ సీఎస్‌కేల మధ్య తొలి మ్యాచ్‌ను రోహిత్‌శర్మ ఘనంగా ప్రారంభించారు.ముంబై ఇండియన్స్ జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరవ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, పాటిన్‌సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రాచెన్నై సూపర్‌కింగ్ […]
ఇంటర్‌నెట్ డెస్క్: టీమ్‌ఇండియా పరుగులు వీరుడు రోహిత్‌శర్మ మరో ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకీ దిగ్గజం సర్ధార్ సింగ్‌తో కూడిన 12 మంది సభ్యుల బృందం హిట్‌మ్యాన్ సహా మరో ముగ్గురి పేర్లను ఖేల్‌రత్నకు ప్రతిపాదించింది. రెజ్లర్ వినీశ్ ఫొగాట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, దివ్యాంగ హైజంపర్ మరియప్పన్ తంగవేలు పేర్లను కమిటీ ప్రభుత్వానికి సిఫార్సుచేసింది. కమిటీ […]
కరోనా కారణంగా వాయిదాపడిన ఇండియన్ప్రీమియర్లీగ్(ఐపీఎల్) తేదీ ఖరారైంది. సెప్టెంబర్19న ప్రారంభంకానుంది. అభిమాన ఆటగాళ్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వన్డే క్రికెట్ప్రపంచ కప్సెమీ ఫైనల్ తర్వాత మైదానంలోకి దిగని మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఆట కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
న్యూఢిల్లీ: భారత జట్టు కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన మొదట్లో ధోనీ.. బౌలర్లను చాలా అదుపులో పెట్టుకున్నాడని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఆ తర్వాత క్రమంగా బౌలర్లపై నమ్మకం పెంచుకున్నాడన్నాడు. అదే ఇప్పుడు అద్భుత ఫలితాలను ఇస్తోందన్నాడు. ‘2007లో ధోనీ అతిపెద్ద బాధ్యతను తీసుకున్నాడు. అప్పుడు చాలా ఉత్సాహంగా కనిపించాడు. అది పెద్ద బాధ్యత అని తెలిసినా ఏనాడూ వెనుకడగు వేయలేదు. చాలా అంశాల్లో మార్పులు తీసుకొచ్చాడు. జట్టు సమావేశాలను ఐదు నిమిషాల్లోనే ముగించేవాడు. 2007 […]
జోహెన్స్‌బర్గ్: చెన్నై సూపర్‌కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆలోచనాపరులు ఎక్కువ మంది ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ఫ్లెసిస్ అన్నాడు. దీనివల్లే సూపర్‌కింగ్స్ ఐపీఎల్లో బాగా విజయవంతం అవుతుందన్నాడు. ‘చెన్నైతో నా అనుబంధం విడదీయలేనిది. మాది కామ్ డ్రెస్సింగ్ రూమ్. దిగ్గజ కెప్టెన్ ధోనీతో పాటు చాలా మంది ఆలోచనాపరులు ఉన్నారు. వీళ్ల అనుభవం టీమ్‌కు అదనపు బలం. ప్రతి ఒక్కరిలో ఓ నమ్మకం ఉంటుంది. అవే మాకు విజయాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రతి ప్లేయర్ చాలా […]
న్యూఢిల్లీ: మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి క్రికెట్ ఆడాలని ప్రపంచ దేశాల క్రికెటర్లంతా కోరుకుంటారు. ఇప్పుడు ఆడుతున్న వారైతే తమ అభిమానాన్ని ఏదో రకంగా చూపెడుతుంటారు. అదే కోవలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో కూడా.. మహీపై తన అభిమానాన్ని పాట రూపంలో వెల్లడించబోతున్నాడు. ‘మహీ సాంగ్’ పేరుతో తానే రాసి, కంపోజ్ చేసిన ఈ పాటను మహీ పుట్టిన రోజు జులై 7న విడుదల చేయనున్నాడు. దానికంటే ముందు పాటకు సంబంధించిన టీజర్‌ను సామాజిక […]