సారథి న్యూస్, మెదక్: రైతులు పండించిన ధాన్యంలో తేమ లేకుండా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మెదక్‌జిల్లా కలెక్టర్ఎం.హనుమంతరావు సూచించారు. సోమవారం సాయంత్రం చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి వద్ద రోడ్డుపై వడ్లను ఆరబోసిన రైతులను చూసి తన వాహనాన్ని ఆపి వారితో మాట్లాడారు. ప్రస్తుతం కొన్నిచోట్ల వరి నూర్పిడి పూర్తయిందని, అయితే అకాల వర్షాలు కురవడంతో వడ్లను రోడ్డుపై ఎండబెట్టామని రైతులు వివరించారు. దీనికి స్పందించిన కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు […]
సారథిన్యూస్, నిజాంపేట: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ ఆర్ శంకరన్న బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం శంకరన్న 10వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విజయ్‌కుమార్ నిజాయితీ పరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ కొమ్మట బాబు లక్ష్మీ, దళితసంఘాల నేతలు నరసింహులు దుబాసి సంజీవ్ […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలపై అశ్రద్ధ వహించొద్దని నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఎస్కే యాస్మిన్ బాషా ఆదేశించారు. గడువులోగా రైతువేదికలు నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ మనుచౌదరితో కలిసి బిజినేపల్లి మండలం మహాదేవునిపేట, బిజినపల్లి, పాలెంలో పర్యటించారు. ఆస్తుల ఆన్లైన్ వివరాలు, రైతు వేదికనిర్మాణాలు తదితరల పనులను పరిశీలించారు. మహాదేవుని పేట గ్రామంలో గ్రామ పంచాయతీ […]
నవంబర్ 20 నుంచి ‘తుంగభద్ర’ పుష్కరాలు కోవిడ్–19 నిబంధనలు తప్పనిసరి పాటించాల్సిందే పుష్కర ఘాట్ల పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ సారథి న్యూస్, కర్నూలు, మంత్రాలయం: ఈ ఏడాది నవంబర్20 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు నిర్వహించే తుంగభద్ర నది పుష్కరాలకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కౌతాళం మండలం మేలిగనూరు పుష్కర్‌ఘాట్–1, మంత్రాయంలోని కాచాపురం పుష్కర ఘాట్–2, రామలింగేశ్వర స్వామి దేవాయం రాంపురం పుష్కర […]
కర్నూలు జిల్లాలో భారీవర్షం నంద్యాల డివిజన్‌లో 93.88 మి.మీ. వర్షపాతం పొంగిన నదులు, వాగులు, వంకలు మునిగిన లోతట్టు ప్రాంతాలు, కాలనీలు ప్రజలను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో శనివారం భారీవర్షం కురిసింది. కుండపోత వాన కురవడంతో లోతట్టు, నది పరీవాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహించాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకు వాన కురుస్తూనే ఉంది. జిల్లాలోని కుందూ, హంద్రీ, శ్యాంనదులు […]
సారథి న్యూస్, కర్నూలు: వచ్చే మూడు రోజుల వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని నంద్యాల ఏరియాలోని లోతట్టు ప్రాంత కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ సూచించారు. నంద్యాల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. నంద్యాల డివిజన్ లో మహానంది, నంద్యాల టౌన్, రూరల్, బండి ఆత్మకూరు, మంత్రాలయం తదితర మండలాల్లో ఎక్కువ వర్షం కురవడంతో కుందూనది, శ్యాం కాల్వ తదితర వాగులన్నీ ఉధృతంగా ప్రవహించాయని అన్నారు. వరద ప్రాంతాల్లో […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి చేపట్టిన రాత పరీక్షలు తొలిరోజు విజయవంతంగా ముగిశాయిని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని విద్యానగర్ మాంటిస్సోరి హైస్కూలు, ఎన్ఆర్ పేట సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూలు ఎగ్జామ్ సెంటర్‌ను కలెక్టర్ జి.వీరపాండియన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 127 పరీక్ష కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం జరిగిన పరీక్షకు 76.77 శాతం మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షకు […]
సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు సన్నాహాలు పూర్తయ్యాయి. జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్(సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, ఇతర అధికారులు పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్, కర్నూలు క్లస్టర్ల పరిధిలో ఉదయం 127 పరీక్ష కేంద్రాలు, మధ్యాహ్నం 67 కేంద్రాలు మొత్తం కలిపి 194 కేంద్రాల్లోని 5,542 […]