తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ హీరోయిన్ నిక్కీ గార్లాని కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆమె ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు కరోనా సోకిందని.. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించింది. నిక్కి తెలుగులో సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి చిత్రంలో నటించింది. పలు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించింది. ప్రస్తుతం లారెన్స్ నటిస్తున్న రంగస్థలం తమిళ్ రీమేక్‌లో […]
వాషింగ్టన్: కమలా హ్యారిస్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హ్యరీస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థికి ఎంపికైనా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆమెకు అభినందనలు తెలిపారు. ‘ కమలా హ్యారిస్ ఎంపిక అన్ని వర్గాలకు చెందిన మహిళలకు, ముఖ్యంగా నల్లజాతి, దక్షిణాసియా మహిళలకు గర్వకారణమని చెప్పుకోవచ్చు’ అంటూ ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఫోటోను షేర్ చేశారు.
విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నయనతార ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ప్రియుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నయన్ దివ్యాంగురాలి పాత్రలో నటిస్తుందట. విఘ్నేష్ శివన్ కోసం ఈ పాత్రలో నటించడానికి నయన్ ఒప్పుకుందట. నయనతార ప్రస్తుతం ‘నేత్రికాన్’, ‘మూకుతి అమ్మన్’ సినిమాలతో పాటు రజనీకాంత్ సరసన ‘అన్నాత్తే’ చిత్రంల్లో నటించాల్సి ఉంది. కరోనాతో వీటి షూటింగ్‌లు నిలిచిపోయాయి. కరోనా తగ్గాక కొత్తచిత్రాన్ని ప్రారంభిస్తారని తమిళమీడియా టాక్.
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగున్నదని సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్భూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. అయితే కుష్బూపై సొంతపార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. కేంద్ర నూతన విద్యావిధానంపై కాంగ్రెస్ యువ నేత రాహుల్ సహా ఆ పార్టీ నేతలంతా విమర్శించారు. ఈ నేపథ్యంలో కుష్బూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కుష్బూ పార్టీ లైన్‌ను దాటి మాట్లాడిందని నేతలు ఆరోపించారు. అది కేవలం […]
సోషల్‌మీడియాలో వేధింపులు భరించలేక తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ‘నామ్ తమిళర్’ పార్టీ నేత సీమన్, ‘పనన్‌కట్టు పడై’కి చెందిన హరి నాడార్ మద్దతుదారులు తనను వేధింపులకు గుర్తిచేస్తున్నారని ఆమె ఫేస్బుక్లో విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నారు. గమనించిన స్థానికులు ఆమెను దవాఖానకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ”ఇది నా చివరి వీడియో. సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా నేను తీవ్ర […]
తాను కరోనా నుంచి కోలుకున్నానని బుల్లితెర స్టార్ హీరోయిన్, ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్ నవ్య స్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. కొంతకాలం క్రితం నవ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమె ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ‘ నా క్వారంటైన్ లైఫ్ పూర్తయింది. ఇంతకుముందుకంటే బాగున్నాను. అందరూ ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నాను. దాదాపు 3 వారాలపాటు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. […]
అప్పులబాధ భరించలేక ఓ సీరియల్ నటి, గాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏపీలోని గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు వచ్చి కొంతకాలం టీవీ సీరియల్స్ నటించింది. తర్వాత అవకాశాలు తగ్గడంతో గుంటూరుకు వెళ్లింది. అక్కడ అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కుమార్తె పుట్టిన తర్వాత మనస్పర్థలు రావడంతో భర్తతో విడిపోయారు. అనంతరం చైతన్య అనే రియల్ఎస్టేట్ వ్యాపారిని వివాహం చేసుకున్నారు. గుంటూర్ విద్యానగర్‌లో ఉంటున్న రేఖ పెళ్లి వేడుకల్లో పాటలు పాడటం, యాంకరింగ్ […]
సీనియర్ నటుడు అర్జున్ కూతురు, నటి ఐశ్వర్య అర్జున్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఐశ్వర్య సోషల్ మీడియాలో వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఇక ఐశ్వర్య 2013లో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఆమె ప్రస్తుతం హోంఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని చెప్పారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు త్వరలో అందరితో […]