సారథి న్యూస్, మహబూబ్‌నగర్: ఓ వైపు ఏసీబీ అధికారులు ఆట కట్టిస్తున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కీసర తహసీల్దార్ నాగరాజు, మెదక్ జేసీ ఉదంతం మరువకముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరోపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ రూ.1.65 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లో క్లోరినేషన్ మెటీరియల్ ను అలీ అహ్మద్ అనే వ్యాపారి సరఫరా […]
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ భూ వివాదంలో నాగరాజు రూ. కోటి పదిలక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అయితే నాగరాజు ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైలు గదిలో ఆయన ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు జైలు అధికారులు తెలిపారు.
అక్రమాస్తుల కేసులో ఏసీబీ చిక్కిన మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు చూస్తుంటే ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగిపోతుందట. అతడికి ఏకంగా రూ. 100 పైనే ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నరసింహారెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు సమాచారం. మరోవైపు నిన్న జరిపిన సోదాల్లో ఏసీపీ ఇంట్లో 15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్‌లో రెండు ఇండ్లు, హఫీజ్‌పేట్‌లో 3 […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఏకకాలంలో హైదరాబాద్‌లో ఆరుచోట్ల దాడులు నిర్వహించారు. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన ఆయన పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూవివాదాల్లో తలదూర్చారనే ఉన్నాయి. తన వాళ్లకు అన్ని పనులు చేసిపెట్టేవారని వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేశారు.
బాలీవుడ్లో డ్రగ్స్‌కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వారికి కొందరు ఏజెంట్లు కోడ్‌నేమ్‌లతో డ్రగ్స్‌ను విక్రయించినట్టు ఏన్సీబీ విచారణలో తేలిందట. త్వరలోనే వారికి ఎన్సీబీ నోటీసులు జారీచేయనుందట. ఈ మేరకు జాతీయమీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రకుల్ ప్రీత్‌సింగ్, సారా అలీఖాన్ పేర్లు వినిపించాయి. అయితే ఈ కేసులో మీడియాలో తనపేరు రాకుండా చూడాలని రకుల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన […]
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఆయన ఆస్తులపై విచారణ మొదలుపెట్టిన అధికారులు సారథి న్యూస్, మెదక్: భూవివాదంలో పరిష్కారానికి రూ.1.12 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మొదక్ పట్టణంలోని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఇతర ఆస్తులపై కూడా విచారణ మొదలైంది. ఏసీబీ […]
సారథి న్యూస్, పెబ్బేరు: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో సూగూర్ వీఆర్వో రూ. 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సూగూరుకు చెందిన ఆంజనేయులు అనే రైతుకు కొంతకాలంగా అతడి సోదరుల మధ్య భూవివాదం నడుస్తున్నది. వీరి భూసమస్యను పరిష్కరించేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. కాగా, ఆంజనేయులు ఏసీబీని సంప్రదించాడు. రంగంలోకి దిగిన అధికారులు గురువారం […]
సారథిన్యూస్, గద్వాల: లంచం తీసుకుంటూ జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్‌వో భీమ్‌నాయక్ ఏసీబీ అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో డాక్టర్ ఏ మంజుల మెడికల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్ అయ్యారు. ఇందుకోసం రిలీవింగ్ ఆర్డర్ కోసం డీఎంహెచ్‌వోకు దరఖాస్తు చేసుకున్నారు. లంచాలకు అలవాటు పడ్డ డీఎంహెచ్‌వో తన కిందిస్థాయి ఉద్యోగిని సైతం రూ. 7000 లంచం అడిగాడు. దీంతో మంజుల […]