Breaking News

MODI

కేంద్ర సర్వీసుల్లోకి యువ ఐఏఎస్​ ఆమ్రపాలి

కేంద్ర సర్వీసుల్లోకి యువ ఐఏఎస్​ ఆమ్రపాలి

న్యూఢిల్లీ: యువ ఐఏఎస్‌ ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం(పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమెకు స్థానం దక్కింది. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్​ కేడర్​ నుంచి2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ […]

Read More

ఎన్నికలవేళ.. బీహార్​కు భారీప్యాకేజీ

బీహార్​పై ప్రధాని నరేంద్రమోడీకి ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.16వేల కోట్ల తాయిలాలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ప్రధాని మోడీకి బీహార్​కు నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ బీహార్​కు రూ.16వేల కోట్ల విలువైన అభివృధ్ది ప్రాజెక్టులను ఆయన రానున్న 10 రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. ఎల్ పీజీ పైప్ లైన్, ఎల్ఫీజీ బాట్లింగ్ యూనిట్, సీవేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్, కొత్త రైల్వేలైన్లు, రైల్వే వంతెనలు, వివిధ సెక్షన్ల విద్యుదీకరణ తదితర […]

Read More
లాక్​ డౌన్​.. అసంఘటిత రంగంపై దాడి

లాక్​ డౌన్​.. అసంఘటిత రంగంపై దాడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​.. అసంఘటిత రంగం మీద మోడీ సర్కారు చేసిన మూడో దాడి అని కాంగ్రెస్ మాజీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కొద్దిరోజులుగా ఆయన దేశ ఆర్థిక వ్యవస్థ, బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. ఈ వీడియో సిరీస్ లో భాగంగా బుధవారం రాహుల్ స్పందిస్తూ.. ప్రధాని మోదీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ పై పోరులో భాగంగా 21 రోజులు యుద్ధం […]

Read More

ఎల్ఎసీ వద్ద ఉద్రిక్తత

లఢక్ : వాస్తవాధీన రేఖ (ఎల్ఎసీ) వెంబడి ఉద్రిక్త వాతావరణం నెలకొందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె అన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆయన లఢక్ లో పర్యటిస్తున్నారు. ఎల్ఎసీ లోని పాంగాంగ్ సో సరస్సు వద్ద చైనా బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో నరవణె పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను లేహ్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించాను. కొంతమంది అధికారులతో మాట్లాడాను. ఎల్ఎసీ వద్ద ఉద్రిక్త వాతావరణం […]

Read More

మనశక్తిని ప్రపంచానికి చాటుదాం

ఢిల్లీ: మనదేశ శక్తిని ప్రపంచానికి ప్రపంచానికి చాటాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానిమోడీ శనివారం ఢిల్లీలోని ఎర్రకోటపై ఏర్పాటుచేసిన మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటుంది. మనం కూడా కరోనాతో రాజీలేని పోరాటం చేస్తున్నాం. కరోనాపై పోరాటంలో శక్తివంచన లేకుండా కృషిచేస్తున్న కరోనా వారియర్స్​కు (డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది, […]

Read More
ప్రధాని మోదీ అరుదైన రికార్డు

ప్రధాని మోడీ మరో రికార్డు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన రికార్డును సాధించారు. అత్యధిక కాలం పదవిలో ఉన్న కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన ఖ్యాతిని గడించారు. వాజపేయి కాంగ్రెసేతర ప్రధానిగా 2,268 రోజులు కొనసాగారు. కాగా, గురువారంతో ప్రధాని మోడీ ఆ రికార్డును అధిగమించారు. ఈ మేరకు బీజేపీ సోషల్​మీడియా జాతీయవిభాగం ఇంచార్జి ప్రీతీ గాంధీ ట్వీట్​ చేశారు. ఇక సుదీర్ఘకాలం పదవిలో ఉన్న వారిలో మోదీ నాలుగో స్థానానికి చేరారు. తొలి మూడు స్థానాల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, […]

Read More
మోదీ క్రేజ్​ అస్సలు తగ్గలేదు

మోడీ క్రేజ్​​ అస్సలు తగ్గలేదు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది.తాజాగా ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో 66 శాతం మంది మోడీ పాలన బాగుందని , తర్వాత కూడా ఆయనే ప్రధానిగా ఉండాలని కోరుకున్నారు. రాహుల్​గాంధీ ప్రధానిగా ఉండాలని 8 శాతం మంది, సోనియా ప్రధాని కావాలని కేవలం 5 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. నాలుగు శాతం మంది కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను, మూడు శాతం మంది యోగి ఆదిత్య నాథ్ ను, […]

Read More
కేరళలో ఘోర విమానప్రమాదం

విమానం ముక్కలు.. 19 మంది మృతి

తిరువనంతపురం: దుబాయ్​ నుంచి కేరళ రాష్ట్రంలోని కోజికోడ్​కు వస్తున్న ఓ ఎయిర్​ ఇండియా విమానం కుప్పకూలింది. విమానం లోయలోపడి రెండు ముక్కలు కావడంతో పైలట్​, ఐదుగురు సిబ్బందితో పాటు మరో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఎయిర్​ ఇండియాకు చెందిన డీఎక్స్ ​బీ​సీసీజే బోయింగ్​ 737 విమానం రన్​వే పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 15 మంది […]

Read More