Breaking News

CARONA

వేడుకలు వద్దు

వేడుకలు వద్దు.. మొక్కలు నాటండి

సారథి న్యూస్​, వరంగల్​: తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఆగస్టు 5న) ఎలాంటి వేడుకలు, ఉత్సవాలు చేయవద్దని వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్​ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యకర్తలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైతే ఎవరి ఇండ్ల వద్ద వారు మొక్కలు నాటాలని సూచించారు. భారీగా గుమిగూడడం, కేక్​కట్​ చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టవద్దని కోరారు.

Read More
SMITHA SINGER

కరోనా ఎలా సోకిందో తెలియట్లేదు

కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్​ గా నిర్ధారణ అయ్యింది. తాజాగా పాప్ సింగర్ స్మిత, ఆమె భర్తకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ట్విట్టర్​లో వెల్లడించారు. ‘నిన్న ఎంతో ఇబ్బందికర రోజు. బాగా ఒళ్లు నొప్పులు అయ్యాయి. ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకోగా, నాకూ.. అలాగే నా భర్త శశాంక్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. పెద్దగా లక్షణాలు […]

Read More
తెలంగాణలో 1,286 కరోనా కేసులు

తెలంగాణలో 1,286 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 1,286 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 12 మరణాలు సంభవించినట్లు మీడియా బులెటిన్​లో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డి జిల్లాలో 121 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 68,946కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 49,675 మంది కోలుకున్నారని వెల్లడించారు. 18,708 మంది చికిత్స తీసుకుంటున్నారు. […]

Read More
కర్ణాటక మాజీ సీఎంకు కరోనా

కర్ణాటక మాజీ సీఎంకు కరోనా

బెంగళూరు: కరోనా మహమ్మారి దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్​ సీఎంలకు కరోనాకు అంటుకోగా, తాజాగా కాంగ్రెస్​ సీనియర్​ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ఈ విషయన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్​లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని అయినప్పటికీ వైద్యుల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరానని ప్రకటించారు. అలాగే తనతో సన్నిహితంగా మెలిగినవారు అప్రమత్తం కావాలని, స్వీయ నిర్బంధం పాటించాలని ట్వీట్‌ చేశారు. […]

Read More
దేశంలో పెరుగతున్న కేసులు

52వేల కొత్త కరోనా కేసులు

ఢిల్లీ: మనదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. గత 24 గంటల్లో 6,61,715 టెస్టులు చేయగా.. 52,050 కొత్తకేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. కాగా, ఇప్పటివరకు మొత్తం 12,30 509 మంది కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 38,938కు చేరుకుంది. 5,86,298 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read More

మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇకలేరు

సారథి న్యూస్​, భద్రాచలం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (60) సోమవారం కరోనాతో కన్నుమూశారు. ఆయనకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో భద్రాచలం నుంచి విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు. ఆయన భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014 ఎన్నికల్లో మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఇద్దరు కుమారులు, అల్లుడికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. రాజయ్య మృతికి తెలంగాణ సీఎం […]

Read More
కరోనా రామడుగు ఎమ్మార్వో

రామడుగులో కరోనా కలకలం

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని శిక్షణా అధికారికి కరోనా సోకింది. దీంతో ఇటీవల తహసీల్దార్​ కార్యాలయానికి వెళ్లిన వారంతా ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ సిబ్బంది కార్యాలయాన్ని శానిటైజ్​ చేశారు. పరిసరాలను శుభ్రపరిచారు. రామడుగు మండలంలోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య​ అధికారులు సూచించారు. ఇటీవల రామడుగు తహసీల్దార్​ కార్యాలయానికి వెళ్లిన వారంతా హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించారు.

Read More

కరోనా.. అలసత్వం వద్దు

సారథి న్యూస్​, మానవపాడు: కొంతమంది కరోనాను చాలా తేలికగా తీసుకుంటున్నారని మహమ్మారిపై అలసత్వం ఏ మాత్రం పనికిరాదని జోగుళాంబ గద్వాల జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్​ సునీత పేర్కొన్నారు. కరోనాపై అలసత్వం వహిస్తే అది మన ప్రాణాలనే హరిస్తుందని చెప్పారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సోమవారం మానవపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మానవపాడు మండలంలో సోమవారం ఒక్కరోజే 24 పరీక్షలు చేయగా 12 మందికి కరోనా సోకిందని చెప్పారు. […]

Read More