Breaking News

CARONA

సుధీర్​రెడ్డికి కరోనా

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

సారథిన్యూస్, హైదరాబాద్: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డికి కరోనా పాజిటివ్​గా నిర్దారణ అయ్యింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కూడా కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ల సలహాలమేరకు సుధీర్​రెడ్డి కుటుంబసభ్యులందరూ ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటికే హోంమంత్రి మహమూద్​ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే […]

Read More
కొత్తగా 60 వేల కేసులు

60వేల కొత్త కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. గత 24 గంటల్లో 60 వేల కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులసంఖ్య 20,88,611కు చేరుకున్నది. ఇప్పటివరకు 42,518 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 14,27,005 మంది డిశ్చార్జి అయ్యారు. 6,19,088 యాక్టివ్​ కేసులున్నాయి. 24 గంట్లో 933 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమేరక శనివారం కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. కరోనా లక్షణాలు […]

Read More
ఒకేరోజు 2,226 కరోనా కేసులు

ఒకేరోజు 2,256 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 77,513 పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి 14 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు చనిపోయిన వారిసంఖ్య 615కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 22,568 వరకు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 464 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​26, భద్రాద్రికొత్తగూడెం 79, జగిత్యాల 49, భూపాలపల్లి 38, జోగుళాంబ గద్వాల 95, కామారెడ్డి […]

Read More

శృంగార ఔషధంతో కరోనాకు చెక్​

వాషింగ్టన్​: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని ‘ఆర్​ఎల్​ఎఫ్-​​100’ అనే ఔషధం పనిచేస్తుందని అమెరికా వైద్యులు తేల్చారు. ఈ మందును రోగులపై వాడేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఆమోదం తెలిపింది. అయితే ఈ మందు కొత్తగా వాడుకలోకి వచ్చిందేమి కాదు. శృంగార సమయంలో పరుషులకు ఉత్తేజాన్ని ఇచ్చేందుకు ఈ మందును వినియోగించేవారు. కానీ ప్రస్తుతం ఇది కరోనాను నియంత్రిస్తుండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మందును ‘అవిప్టడిల్’ అనే పేరుతో మార్కెట్లో అమ్ముతుంటారు. దీన్ని ముక్కుద్వారా […]

Read More
కోవిడ్​ వ్యాక్సిన్​ ధర రూ. 225

కరోనా వ్యాక్సిన్​ ధర రూ.225

పుణే: కరోనా వ్యాక్సిన్​ తయారీలో భారత్​కు చెందిన పలు ఫార్మా కంపెనీలు పురోగతి సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుణేలోని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా కూడా కరోనా వ్యాక్సిన్​ తయారు చేస్తున్నది. సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా కంపెనీ.. బిల్ అండ్​ మెలిండా గేట్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి (జీఏవీఐ) భాగస్వామ్యంతో భారతదేశంతో సహా 92 దేశాలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నది. కాగా దీని ధర రూ. 225 గా […]

Read More
265 మంది ఖైదీలకు కరోనా

265 మంది ఖైదీలకు కరోనా

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్​ జైల్​లో 265మంది ఖైదీలకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. వారితో పాటు 24మంది జైలు సిబ్బంది కోవిడ్​ బారినపడ్డారు. ఆగస్టు 3న 900మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకేరోజు 247మందికి కరోనా ప్రబలినట్లు సంబంధిత వర్గాల ద్వారా తేలింది. కోవిడ్​ ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు చేయలేక ఖైదీలకు జైలులోనే ఉంచి పోలీసు సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. జైలులో మొత్తం 1675 మంది ఉంటే 265 మందికి ఈ కరోనా వైరస్​ సోకడంతో […]

Read More
భారీగా పెరుగుతున్న కేసులు

కరోనా కేసులు@ 20 లక్షలు

ఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. గురువారం నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 62,538 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు మొత్తం 20,27075 మందికి కరోనా సోకగా, 41,585 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,07384 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,78,106 మంది కోలుకున్నారు. ఒక్క రోజులో 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కరోనా దేశంలో మరణాల రేటు 2. […]

Read More
స్టేషన్​కు వచ్చేవారితో మర్యాదగా మెలగాలి

స్టేషన్​కు వచ్చేవారితో మర్యాదగా మెలగాలి

సారథి న్యూస్​, కర్నూలు: పలు రకాల సమస్యలపై పోలీసుస్టేషన్లను ఆశ్రయించే వారితో పోలీసులు మర్యాదపూర్వకంగా మెలగాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి కిందిస్థాయి పోలీసు అధికారులకు సూచించారు. దురుసు ప్రవర్తన ప్రదర్శిస్తే పోలీసు సిబ్బందిపై చర్యలు తప్పని హెచ్చరించారు. గురువారం ఆయన కర్నూలు జిల్లా పోలీసు ఆఫీసులోని కోవిడ్ కమాండ్ కంట్రోల్ నుంచి వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని సూచించారు. ఫిర్యాదుల పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్స్ ప్లోజివ్ […]

Read More