Breaking News

CARONA

బండరపల్లి చెక్​డ్యాంకు జలకళ

సారథి న్యూస్​, దేవరకద్ర: మహబూబ్​నగర్​ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్​పల్లి చెక్​డ్యాం అలుగు పారుతోంది. బండర్​పల్లి వంతెనను గతేడాది మంత్రి టి.హరీశ్​రావు చొరవతో చెక్​డ్యాంగా నిర్మించారు. కాగా, కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పెద్దఎత్తున నీరు చేరి అలుగు పారుతోంది. చెక్ డ్యాం నిండడంతో పరిసర గ్రామల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్​డ్యాంకు నిధులు మంజూరు చేసిన మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Read More
ఏపీలో 9,996 కరోనా కేసులు

ఏపీలో 9,996 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో గురువారం కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడి తాజాగా 82 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,378కు చేరింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ ​కేసులు 2,64,142కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 90,840కు చేరింది. వ్యాధిబారిన పడి 24 గంటల్లో 9,499 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,70,924 మంది కోలుకున్నారు. ఇక వ్యాధి తీవ్రతను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 […]

Read More
తెలంగాణలో 1,931కరోనా కేసులు

తెలంగాణలో 1,931 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,931 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. అయితే మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 665 మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 86,475 కేసుల నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఒకేరోజు 293 కేసులు నిర్ధారణ అయ్యాయి. 24 గంటల్లో 1,780 మంది కరోనా నుంచి రికవరీ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం యాక్టివ్​కేసులు 22,736 ఉన్నాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. వరంగల్ అర్బన్ […]

Read More

తప్పడు ప్రచారం చేస్తే కఠినచర్యలు

సారథి న్యూస్, రామడుగు: కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్​ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. కరోనా వచ్చిందని రోగుల వివరాలు బయటపెడితే చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే గ్రూప్​ అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్​మెంట్​ ఆక్ట్, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కరోనా కట్టడిలో మండల ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Read More

చిన్నశంకరంపేటలో రెండు కేసులు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో బుధవారం రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్​ శ్రావణి తెలిపారు. మొత్తం 11 మందికి టెస్టులు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి టెస్టులు చేసుకోవాలన్నారు.

Read More
సింగరేణిలో కరోనా కట్టడికి చర్యలు

కరోనా కట్టడికి చర్యలు

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఆస్పత్రిని బుధవారం సింగరేణి జీఎం నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా​-1 లోని కొందరు ఉద్యోగులకు కరోనా ప్రబలింది. వారంతా రామగుండం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణిలోని ఉద్యోగులు, వారికుటుంబసభ్యులు విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. రామగుండం ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 200 మందికి కరోనా టెస్టులు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారని […]

Read More

కూలీలకు మస్తు డిమాండ్

సారథి న్యూస్, రామడుగు: కరోనా విపత్తు వేళ గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు డిమాండ్​ ఏర్పడింది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రస్తుతం రైతులు వరినాట్లు వేస్తున్నారు. కరోనా భయంతో కూలీలెవరూ వ్యవసాయ పనులకు రావడం లేదు. రూ. 450 ఇస్తామన్నా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు ఇతర గ్రామాల నుంచి కూలీలను ఆటోలు, ట్రాక్టర్లను ఎక్కువ కూలీ ఇచ్చి తీసుకొస్తున్నారు. వరినాట్లు వేసేందుకు ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేల గుత్తకు […]

Read More
ఏపీలో 9,597 కరోనా కేసులు

ఏపీలో 9,597 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం 9,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 93 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 2,296కు చేరింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,54,146కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 57,148 నమూనాలు పరీక్షించారు. తాజాగా వ్యాధిబారిన నుంచి 6,676 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,61,425కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం […]

Read More