Breaking News

BJP

ఆదిలాబాద్​పై వివక్ష

సారథి న్యూస్ ఆదిలాబాద్: సీఎం కేసీఆర్​ ఆదిలాబాద్ జిల్లాపై కక్ష గట్టారని.. అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్​తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ పనులను పరిశీలించారు. వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్డియాలజీ, న్యూరాలజితోపాటు తొమ్మిది విభాగాలతో కూడిన ఆధునిక హంగులతో ఆస్పత్రి భవనానికి 150 కోట్లు […]

Read More

పనులు ప్రారంభించేదెప్పుడు?

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్యపనులను వెంటనే మొదలు పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్​ చేశారు. నిధులు విడుదలైనప్పటికీ డంపింగ్​యార్డు, శ్మశానవాటిక పనులు ఇంకా ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు వారు సోమవారం రామడుగు డివిజినల్​ పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు పురేళ్ల శ్రీకాంత్​, అనుపురం పరుశరాం, ఉపసర్పంచ్​ రాజేందర్​ తదితరులు ఉన్నారు.

Read More

హర్యానా ఎమ్మెల్యేకు కరోనా

చండీగఢ్‌: హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ ‌సుధాకు కరోనా పాజిటివ్​ అని తెలిసింది. సుభాష్​ కురుక్షేత్ర జిల్లాలోని థానేసర్​కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన కొంతకాలంగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్​ దవాఖానకు తీసుకెళ్లి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్​ అని తెలిందని ఆయన వ్యక్తిగత సహాయకుడు అరుణ్​ గులాటి మీడియాకు తెలిపారు. జూన్ 21న సంభ‌వించిన సూర్యగ్రహణం రోజున నిర్వహించిన ఓ పూజలో ఆయన పాల్గొన్నట్టు సమాచారం. ఆ పూజకు […]

Read More
ఏపీలో బీజేపీ జెండా ఎగరవేస్తాం

ఏపీలో బీజేపీ జెండా ఎగరవేస్తాం

సారథి న్యూస్, కర్నూలు: ప్రతి ఒక్కరి అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యదర్శి మధుకర్ జి, బైరెడ్డి శబరి, రాష్ట్ర కార్యదర్శి హరీశ్ బాబు, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు రామస్వామి, పార్టీ నాయకులతో కలిసి పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇంటింటికి తిరిగి దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్రమోడీ 2.0 ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. దేశంలోని ప్రతి […]

Read More
బీజేపీ బలపడుతోంది

బీజేపీ బలపడుతోంది

సారథి న్యూస్​, కర్నూలు: క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, భవిష్యత్‌లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీయేనని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ఉద్ఘాటించారు. శనివారం సాయంత్రం నగరంలోని లక్ష్మిహోటల్‌ పక్కన పార్టీ కర్నూలు జిల్లా ఆఫీసును ఎంపీ టీజీ వెంకటేష్‌తో పాటు సీనియర్‌ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, రాష్ట్రంలోనూ […]

Read More

చైనా వస్తువులను బహిష్కరిద్దాం

సారథి న్యూస్, కర్నూలు: ఇండియా బోర్డర్​లోని గాల్వాన్‌ లోయలో చైనా సైనికుల దుశ్చర్యకు 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని, ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారి వస్తువులను బహిష్కరించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్​ పార్థసారధి పిలుపునిచ్చారు. చైనా వస్తువులను బహిష్కరించే అవకాశం భారత ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని ప్రతిఒక్కరికీ కల్పించారని పేర్కొన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి పౌరుడు మేడిన్‌ ఇండియా వస్తువులనే కొనాలని కోరారు.

Read More

కరోనా కట్టడిలో టీఆర్​ఎస్​ విఫలం

సారథి న్యూస్, హుస్నాబాద్: కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపించారు. సోమవారం కరీంనగర్​ జిల్లా అక్కన్నపేటలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడం లేదని ఆరోపించారు. అనంతరం అక్కన్నపేట వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సంపత్ కుమార్, కార్తీక్, కృష్ణ, వంశీ, రాహుల్, కల్యాణ్​, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

సారథి న్యూస్, హుస్నాబాద్: అక్రమ అరెస్టులతో ఉద్యమన్ని ఆపలేరని బీజేపీ మండలాధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో ఆయన విలేరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ బిల్లులు ప్రజలను కంటతడి పెట్టిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రాజకీయా బెదిరింపులకు భయపడబోమన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు వేణుగోపాలరావు, మోహన్ నాయక్, నరేష్, అజయ్, కృష్ణ, కార్తీక్, సాగర్, సంపత్, సుధాకర్, కళ్యాణ్, శ్రీనాథ్, సాంబరాజు పాల్గొన్నారు

Read More