Breaking News

POLICE

12 మంది పోలీసులకు కరోనా

డ్యూటీలో అప్రమత్తంగా ఉండండి

సారథి న్యూస్, మహబూబ్​నగర్: జిల్లాలో కరోనా మహమ్మారి పెరుగుతోంది. జిల్లాలో 12 మంది పోలీసులకు కరోనా పాజిటివ్​గా తేలింది. విధుల్లో ఉండే పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రెమారాజేశ్వరి సూచించారు. డ్యూటీలో ఉన్న సమయంలో సామాజిక దూరం పాటిస్తూనే తప్పనిసరిగా మాస్క్​లు కట్టుకోవాలని సూచించారు. జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. నవాబ్​పేట మండలం కొల్లూరు గ్రామంలో మీసేవ నిర్వాహకుడు కరోనాతో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.

Read More

దోపిడీ గ్యాంగ్​ అరెస్ట్​ ​

భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమ జంటలను బెదిరించి వారివద్ద డబ్బు, నగలు దోపీడి చేస్తున్న ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. రేగళ్ల అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్​ చేస్తుండగా వీరు పట్టుబడ్డారని చెప్పారు. జిల్లాకు చెందిన ఓ ఆరుగురు ముఠాగా ఏర్పడి ప్రేమజంటలను కత్తులు, మారణాయుధాలతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరిపై దోపీడీ, దొంగతనం కేసులున్నాయని సీఐ అశోక్​చ ఎస్సై ప్రవీణ్​కుమార్​ తెలిపారు. వీరి వద్ద నుంచి 10 తులాల […]

Read More

నిఘా నీడలో..

సారథిన్యూస్​, ఖమ్మం : మావోయిస్టుల కదలికల నేఫథ్యంలో.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీపురంలో మంగళవారం భారీ బందోబస్తు నడుమ గ్రీన్​ఫీల్డ్​ సర్వే నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసులు బందోబస్తులో పాల్గన్నారు. వైరా ఏసీపీ సత్యనారాయణ, కల్లూరు ఏసీపీ వెంకటేశ్​, వైరా సీఐ వసంత కుమార్, తల్లాడ వైరా, కల్లూరు ఎస్సైలు తిరుపతిరెడ్డి, సురేశ్​, రఫీ ఆధ్వర్యంలో సర్వే కొనసాగింది. తల్లాడ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీసు బలగాలతో పొలాల్లో చేల గట్లపై బురదలో నడుచుకుంటూ సర్వేకు […]

Read More
పోలీసులకు పల్స్ ఆక్సీమీటర్లు

పోలీసులకు పల్స్ ఆక్సీమీటర్లు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు పోలీసు సంక్షేమంలో భాగంగా 55 ఏళ్లు పైబడి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి హెల్త్​ కండీషన్​ను పరీక్షించేందుకు సోమవారం 150 పల్స్ ఆక్సీమీటర్లను పంపిణీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్​స్టేషన్లు, సర్కిల్​ఆఫీసులు, డీఎస్పీ ఆఫీసులకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చినట్లు తెలిపారు. పల్స్ ఆక్సీమీటర్ ద్వారా ముందస్తుగా కరోనా లక్షణాలను తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ ఆంజనేయులు, ఎఆర్ […]

Read More

ముగ్గురు ఉగ్రవాదులు హతం

అనంత్‌నాగ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని అనంత్​నగాగ్​ జిల్లా ఖుల్​చోహార్​ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ స్థలంలో పోలీసులు, ఆర్మీ జవాన్ల గాలింపు కొనసాగుతుందని కశ్మీర్ జోన్ పోలీసులు చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. శనివారం చేవా ఉల్లార్ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. జమ్మూకశ్మీర్ లో ఇటీవల వరుసగా సాగుతున్న ఎదురుకాల్పుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు సైనికబలగాలతో కలిసి […]

Read More

నాటుసారాపై ఉక్కుపాదం

సారథిన్యూస్​, రామగుండం: నాటుసారాను తయారుచేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలోని పలు గుడాంబా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల మండలం కొలనూరు చెరువు సమీపంలో గుడుంబా స్థావరాలపై దాడులు జరిపి గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన ఆరువందల లీటర్ల బెల్లం పానకం, 50 కిలోల బెల్లం, నాటుసారా తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కుమార్​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ […]

Read More

గంజాయి పట్టివేత

సారథిన్యూస్​, ఖమ్మం: ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండల కేంద్రంలో పోలీసులు 21 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకుకొని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Read More

భారీగా గుట్కా పట్టివేత

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా వివిధ గ్రామాల్లో సోదాలు చేపట్టారు. అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 22, 600 విలువ గల గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మోతే గ్రామానికి చెందిన తిరుపతి, పుదారి శ్రీనివాస్​, లక్ష్మీపూర్​కు చెందిన సురేశ్​, గుండికి చెందిన చిట్ల మునీందర్​లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష వెల్లడించారు.

Read More