సారథి న్యూస్, హైదరాబాద్: భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు గొంగడి సునిత, రేగా కాంతారావు, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, […]
సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట 15 వార్డులో సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ బి.వై. రామయ్య ప్రారంభించారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. లక్షలాది మంది […]
సారథిన్యూస్, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం ఆశయాలు కొనసాగిద్దామని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్‌రాజన్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కలాం ఐదో వర్ధంతి సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమిళనాడులోని కలాం బంధువులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
సారథిన్యూస్, రామగుండం: మాజీ ఉపప్రధాని జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని రామగుండం మున్సిపల్ చైర్మన్ ఉదయ్‌కుమార్ పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకొని దళితులు అన్నిరంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఆల్ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు, సంయుక్త కార్యదర్శి సతీశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన లింగయ్య, కాంగ్రెస్ నాయకుడు […]
సారథి న్యూస్, కరీంనగర్: స్వామి వివేకానంద సూక్తులు యువత పాటించాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతలు రేండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా వెదిర క్రాస్‌రోడ్డు వద్ద వివేకానంద వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామి వివేకానంద జీవిత చరిత్రను అందరూ చదవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు బందారపు అజయ్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ […]
సారథి న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రానికి తెలంగాణ జల వైతాళికుడు ఆర్.విద్యాసాగర్ రావు సేవలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు గుర్తుచేశారు. బుధవారం విద్యాసాగర్ రావు మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ కోల్పోయిన ప్రతి నీటిబొట్టును లెక్కగట్టిన గొప్ప జలనిపుణుడని, చివరి శ్వాసవరకు తెలంగాణ సాగు నీటి రంగానికి […]