సారథి న్యూస్, వనపర్తి: చారిత్రక సరళాసాగర్ ప్రాజెక్టు గండి పూడ్చివేత, పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మంగళవారం ప్రాజెక్టును మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పున:ప్రారంభించనున్నారు. డిసెంబర్ 31న ప్రాజెక్టుకు గండిపడడంతో నీరతా వృథాగాపోయింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్దృష్టికి తీసుకెళ్లడంతో ప్రకృతి విపత్తుల నిధుల నుంచి రూ.ఆరుకోట్లకుపైగా నిధులు మంజూరు చేశారు. మే నెలలో డిజైన్ ఇచ్చి అధికారులు పనులను మెగా కంపెనీకి అప్పగించారు. వెంటనే వారు పనులు ప్రారంభించారు. […]
సారథి న్యూస్, వనపర్తి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు, రైతు వేదికల నిర్మాణం, పల్లె, పట్టణ ప్రగతి పనులను విజయవంతంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. జాబ్‌కార్డులు ఉన్న కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కొత్తవారికి జాబ్‌కార్డులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం ఆయన హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రైతు వేదికల పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన నిధులతో వచ్చిన దరఖాస్తులను అనుసరించి […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఈ.శ్రీధర్‌ను బదిలీచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఎస్ కే యాస్మిన్‌బాషాకు నాగర్ కర్నూల్ అదనపు బాధ్యతలు అప్పగించారు. సోమవారం ఉదయం చార్జ్ ను అప్పగించి కలెక్టర్ బాధ్యతల నుంచి ఈ.శ్రీధర్ రిలీవ్ అయ్యారు. నాగర్ […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఈ.శ్రీధర్‌పై ఆదివారం బదిలీవేటు పడింది. వనపర్తి జిల్లా కలెక్టర్ యాష్మిన్బాషాకు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదనే కారణంతో బదిలీ వేటుపడినట్లు తెలుస్తోంది. అలాగే గృహనిర్మాణశాఖ అదనపు బాధ్యతల నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ను ప్రభుత్వం తప్పించింది. ఆమె స్థానంలో సునీల్‌శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
సారథి న్యూస్, వనపర్తి: రిజర్వేషన్ల పితామహుడు, సాంఘిక సంస్కర్త సాహు మహారాజ్ జయంతి వేడుకలను శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజావాగ్గేయకారుడు రాజా రామ్ ప్రకాష్, కవి పండితుడు గిరిరాజయ్య చారి, కవి గాయకుడు విభూది ఈశ్వర్, డప్పు నాగరాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగవుల వెంకటస్వామి, రెడ్డి సేవా సంఘం నాయకులు కృపాకర్ రెడ్డి, బాలస్వామి నాయుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, వనపర్తి: ఆపదలో ఉన్న వారిని రక్తదానం చేసి ఆదుకోవచ్చని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వనపర్తిలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఉచిత రక్తదాన శిబిరానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ ద్వారా కరోనా సమయంలోనూ […]
సారథి న్యూస్, వనపర్తి: కరోనా పట్ల వనపర్తి జిల్లా ప్రజలు మరింత అప్రమతంగా ఉండాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. వచ్చేవారం నుంచి జిల్లాలోని నాలుగు కోర్టులు ప్రారంభమవుతున్న దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా న్యాయమూర్తులు, లాయర్లకు మాస్కులు, థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు, శానిటైజర్లను 9వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసులుకు శుక్రవారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నివారణకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. వానాకాలంలో మరింత అప్రమత్తంగా […]
సారథి న్యూస్, వనపర్తి: మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యుల జీవనోపాదుల సర్వేను రెండు రోజుల్లో కంప్లీట్ చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం పలు పథకాలపై సమీక్షించారు. కోవిడ్ రుణాలకు సంబంధించి 5,445 సంఘాలకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 533 సంఘాలకు రూ.3.14 కోట్లు మాత్రమే ఇచ్చామని తెలిపారు. బ్యాంకుల అనుసంధానంతో అమలుచేసే పథకాలను కలెక్టర్ సమీక్షిస్తూ ఈ నెలాఖరు నాటికి రూ.16.8కోట్ల రుణం ఇవ్వాల్సి […]