సారథి న్యూస్, రామగుండం: చిరుత పులి సంచరిస్తున్న నేపథ్యంలో పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచించారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఫారెస్ట్అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ శివారులో చిరుత పులి సంచరిస్తోందని, శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. సమావేశంలో నగర మేయర్ అనిల్ కుమార్, అడవిశాఖ […]
సారథి న్యూస్, రామగుండం: మహనీయుల జీవితాలను యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. నేషనల్ యూత్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీరామ విద్యానికేతన్ ఆవరణలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి, స్వామి వివేకానంద 150వ జయంతి, జాతీయ యువజన వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధ్యక్షుడు కె.యాదవరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, […]
సారథి న్యూస్, రామగుండం: ఉద్యోగులంతా సమష్టిగా కలిసి పనిచేసి బొగ్గు ఉత్పాదక పనులను వేగవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం 11వ బొగ్గు గనిలో కంటిన్యూస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత సంబంధించి జీఎం నారాయణ, గని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో 11 గ్రూప్ ఏజెంట్ మనోహర్, మేనేజర్ నెహ్రూ, గ్రూప్ ఇంజనీర్ రామదాసు, సర్వే అధికారి నారాయణ, వెంటిలేషన్ ఆఫీసర్ జాన్సన్, జెమ్ కో ప్రాజెక్ట్ […]
అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం సీఎం కేసీఆర్ సంతాపం సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి […]
సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎందరో అమరుల ఆత్మబలిదానాలు, ఉద్యమనేతల అలుపెరగని పోరాటంతో పాటు సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అన్నివర్గాల సంక్షేమంతో పాటు కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మత్స్యకార సహకార సంఘాల సమావేశంలో మాట్లాడారు. సీఎం గొప్ప ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు […]
సారథి న్యూస్, రామగుండం: నియోజకవర్గంలో ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు,కార్మికులు, కర్షకులు, అన్నివర్గాల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనిఎమ్మెల్యే కోరుకంటి చందర్ దుర్గాదేవిని వేడుకున్నారు. శుక్రవారం క్యాంపు ఆఫీసులో చండీయాగం నిర్వహించారు. లోక కళ్యాణార్థమే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టానని ఎమ్మెల్యే అన్నారు. కరోనా నుంచి ప్రపంచమంతా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర మేయర్, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ అడపడుచులు ఇంటింటా ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామ, తండ్రిగా సీఎం కేసీఆర్ గారు చీరెలను అందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లో మేయర్ బంగి అనిల్ కుమార్ తో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.317 కోట్లు ఖర్చుచేసి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. 287కు పైగా డిజైన్ల […]
సారథి న్యూస్, రామగుండం: అర్జీ 1 ఏరియాలో 100 శాతం బొగ్గు ఉత్పత్తికి కృషిచేయాలని, ప్రతి ఒక్కరూ లక్షణ సూత్రాలు పాటించాలని ఆర్ జీ వన్ జీఎం కే నారాయణ కోరారు. శనివారం సాయంత్రం ఆయన జీఎం కార్యాలయంలో గని అధికారులతో సమీక్షించారు. ఉత్పత్తి ఉత్పాదకత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. సమావేశంలో అధికారులు త్యాగరాజు, బెంజిమెన్, కేవీ రావు, సత్యనారాయణ, అప్పారావు, వెంకటేశ్వరరావు, నవీన్ కుమార్, ఆంజనేయులు, మురళీధర్, హరినాథ్, గని మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.