ఒవైసీ జంక్షన్ వద్ద రూ.80 కోట్లతో నిర్మాణం లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్ సామాజికసారథి, హైదరాబాద్: నగరంలోని సంతోష్ నగర్ ఒవైసీ జంక్షన్ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల కలామ్ఫ్లై ఓవర్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్ వే మార్గంగా […]
డిసెంబర్ 1న మహానగర ఎన్నికలు మేయర్స్థానం జనరల్ మహిళకు కేటాయింపు 150 వార్డులు.. 9,238 పోలింగ్ సెంటర్ల ఏర్పాటు వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. డిసెంబర్ 1న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 4న ఫలితాలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. అవసరమైన చోట్ల డిసెంబర్ 3న రీ పోలింగ్ నిర్వహిస్తామని వివరించారు. […]
సారథి న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ, నేతలను విమర్శించే స్థాయి కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు లేదని, ఆ పార్టీ బీసీసెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వసుపత్రుల పనితీరు మెరుగుపడాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క యాత్ర చేపడితే టీఆర్ఎస్ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే కరోనా ఉధృతితో […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లో రూ.16.30 కోట్ల వ్యయంతో ఆరు థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ మేయర్బొంతు రామ్మోహన్వెల్లడించారు. బుధవారం ఉప్పల్ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి కాప్రా సర్కిల్‌లో పరిధిలో పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్బీ నగర్జోన్ పరిధిలో రూ.29.25 కోట్ల అంచనా వ్యయంతో 13 థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ థీమ్ పార్కులలో యోగా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్‌లు ఉంటాయన్నారు. ఢిల్లీ, […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు ఏవీ లేకపోయినా ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో మేయర్ హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. తాజాగా ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. త్వరలోనే కోలుకుంటానని మేయర్ ట్వీట్ చేశారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అందరినీ వైరస్ వణికిస్తోంది. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి వైరస్ ప్రబలింది. దీంతో మేయర్ సహా వారి కుటుంబసభ్యులు, ఇతర అధికారులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా మంత్రి హరీశ్‌రావు పీఏకు కూడా కరోనా ప్రబలినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హరీశ్ రావుతో పాటు కుటుంబసభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. […]
సారథి న్యూస్, హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం విసృతంగా పర్యటించారు. కాప్రా సర్కిల్ సాయిబాబా నగర్ కంటైన్ మెంట్ జోన్ లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, డీసీ శైలజ, కార్పొరేటర్ స్వర్ణరాజ్ పాల్గొన్నారు. కవాడిగూడలో డ్రైనేజీ పనుల పరిశీలన.. మేయర్ సుడిగాలి పర్యటన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ జవహర్ నగర్ డంపింగ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: నగర నడిబొడ్డున పంజాగుట్టలో రూ.23కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఆదివారం నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తో కలిసి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. లాక్డౌన్ తో కలిగిన వెసులుబాటుతో అదనంగా కార్మికులు, నిపుణులను నియమించి రేయింబవళ్లు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ను […]