Breaking News

Day: April 19, 2020

సేవే ‘శ్వాస’గా..

సారథి న్యూస్, రంగారెడ్డి: లాక్ డౌన్ నేపథ్యంలో శ్వాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 16 రోజులుగా పేదలు, మున్సిపల్ కార్మికులు, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బందికి రాగి అంబలి, పులిహోరా ప్యాకెట్లు, ఉప్మా, దద్దోజనం వంటి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తూ ఆకలి తీరుస్తున్నారు. సంస్థ చైర్మన్ కాటెపాక ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు దోమలపల్లి లక్ష్మణ్ కొత్తపేట, ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్, బాటసింగారం, కొత్త గూడెం చౌరస్తాలో ఆదివారం నిత్యవసర సరుకులు […]

Read More
మే 7 వరకు లాక్ డౌన్

మే 7 వరకు లాక్ డౌన్

– సీఎం కేసీఆర్ స్పష్టీకరణ * 94-95శాతం ప్రజలు లాక్ డౌన్ పొడిగించాలని కోరారు* నిజాముద్దీన్ సమస్య కొనసాగుతోంది* మే నెలలోనూ రేషన్​ కార్డు దారులకు 12 కేజీల బియ్యం, రూ.1500 సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. బయటి నుంచి ఎవరూ తినుబండారాలు తెప్పించుకోవద్దన్నారు. దేశంలో విమాన సర్వీసులు ఎక్కడ నడిచినా తెలంగాణకు మాత్రం రావడానికి వీల్లేదన్నారు. […]

Read More

కల్లు విక్రయాలపై దాడులు

సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాఅలంపూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయించడంతో సమాచారం తెలుసుకున్న అధికారులు ఆదివారం దాడులు జరిపి వాటిని నేలపాలుచేశారు. కల్లు విక్రయదారులపై చట్టపరమైన చర్యలకు ఆదేశించినట్టు మున్సిపల్ కమిషనర్ మధన్ మోహన్ తెలిపారు.

Read More

శవాన్ని ఊళ్లోకి తేవద్దు

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌతమ్ పల్లి గ్రామానికి చెందిన బక్కమ్మ (45) హైదరాబాద్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడిపేది. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో శనివారం జిల్లా ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం చనిపోయింది. శాంపిల్స్ సేకరణ హైదరాబాద్ నుంచి రావడంతో ఆమె కరోనాతోనే మృతిచెందినట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో బ్లడ్ శాంపిళ్లను […]

Read More
కరోనా కలకలం

కరోనా కలకలం

సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు జిల్లా వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట, తిరుమలగిరి, చివ్వెంల మండలం బిబిగూడెం, నేరేడుచర్ల, పెన్పహాడ్, సూర్యాపేట పట్టణంలో మొత్తం 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం వరకు 713 శాంపిళ్లు సేకరించారు. అందులో ఆదివారం రోజు 40 మంది అనుమానితులు శాంపిల్స్ ఉన్నారు. ఇందులో 200 మంది రిపోర్టులు నెగిటివ్ వచ్చాయి. మిగతా వారి నివేదికలు రావాల్సి ఉంది. ప్రభుత్వ […]

Read More

పేదలు, కార్మికులను ఆదుకుంటాం

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాప్తి.. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు, కార్మికులకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఆదివారం చర్లపల్లి డివిజన్ లో స్టేట్ సివిల్ సప్లయీస్ సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే భేతి సుభాష్రెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి వలస కూలీలకు 12 కేజీల బియ్యం, రూ.500 నగదు చొప్పున మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ […]

Read More

నల్లగొండ జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

సారథి న్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళకు ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఆదివారం ఆమె ఇద్దరు పిల్లలకు కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు మహిళ.. భర్తతో కలిసి గత నెల సూర్యాపేటలోని జరిగిన ఒక ఫంక్షన్ కు వెళ్లి వచ్చారు. కొద్ది రోజులుగా ఆమె దగ్గుతుండటంతో ఆస్పత్రికి వెళ్లారు. వైద్య అధికారులకు అనుమానం వచ్చి పరీక్షలకు పంపగా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు ఆమె భర్తను, ఇద్దరు […]

Read More

స్వేచ్ఛగా.. హాయిగా

– కరోనా నేపథ్యంలో బోసిపోయిన నల్లమల రోడ్లు– ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న అడవి జంతువులు సారథి న్యూస్, నాగర్కర్నూల్: కరోనా ప్రతి ఒక్కరినీ ఇంటికే పరిమితం చేసింది. ఎక్కడ కాలు పెడితే మహమ్మారి అంటుకుంటుందోనని బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కిస్తున్నారు.. కానీ అటవీ జంతువులు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. శ్రీశైలం పేరు చెబితే.. ఠక్కున గుర్తుకొచ్చేది వన్యప్రాణుల నెలవుగా నిలిచిన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అభయారణ్యం.. నల్లమలలోని రోడ్డు వెంట ప్రయాణిస్తే అక్కడి ప్రకృతి అందాలు, పచ్చదనం […]

Read More