నీటి వాటా ప్రకారమే తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తున్నం కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి సమాధానం చెబుతం తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదులు చేయడం సరికాదు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వాస్తవాలు వెల్లడిస్తాం జలవనరులశాఖ అధికారులతో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే […]
సారథి న్యూస్, హైదరాబాద్: వ్యవసాయ శాఖ పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి, స్వతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ..ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని సమావేశంలో పాల్గొన్న అధికారులను, మంత్రులనుద్దేశించి మాట్లాడారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తూ.. ఒక్క రూపాయి భూమిశిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తరువాయి విధానాన్ని రద్దు […]
సారథిన్యూస్, నాగర్‌కర్నూల్: ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన ముంపు బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని నాగర్‌కర్నూల్ కలెక్టర్ శర్మణ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బిజినేపల్లి మండలం వట్టెంలో పర్యటించారు. అక్కడ ఆర్ అండ్ ఆర్ కింద నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న రెండు తండాల ప్రజల కోసం వట్టెంలో 466 ఇండ్లను నిర్మిస్తున్నారు. ఈ ఇండ్లను ఆయన పరిశీలించారు. లేఅవుట్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు […]
ఇరిగేషన్‌శాఖలో నాలుగు విభాగాలు వద్దు ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారిందని, భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు అందుబాటులోకి వచ్చాయని, కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీ జలాలను వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈనెల 2న ప్రాజెక్టుల బాట పట్టాలని సోమవారం కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కృష్ణానదిపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. అక్కడే నిరసన దీక్షలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు దీక్షలను విజయవంతం చేయాలని నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. […]