Breaking News

పెద్దపల్లి

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం

కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటాం

సారథి న్యూస్, రామగుండం: టీఆర్ఎస్ కార్యకర్త ఎంఎన్ శివారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసా ఇచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గుంటూరుపల్లె గ్రామానికి చెందిన శివారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే ఓదార్చారు. ఆత్మహత్యకు పాల్పడిన శివారెడ్డి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మృతుని కుమార్తెకు వైద్యసదుపాయం కల్పిస్తామని భరోసా కల్పిస్తామన్నారు.

Read More

బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​

సారథి న్యూస్​, రామగుండం: బసంత్​నగర్​లో ఎయిర్ట్​పోర్టు నిర్మాణం పూర్తయితే.. రామగుండం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. రామగుండం ప్రాంతంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్​నగర్​లో ఎయిర్​పోర్ట్​ నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో ఆరుచోట్ల ఎయిర్​పోర్టులను నిర్మిస్తున్నారని అందులో బసంత్​నగర్​ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వాల్వ అనసూయ, సర్పంచ్ కొల లత, ఎంపీటీసీ దుర్గం […]

Read More
ఎమ్మెల్యే కోరుకంటి పల్లెనిద్ర

ఎమ్మెల్యే కోరుకంటి పల్లెనిద్ర

సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పల్లెనిద్ర చేపట్టారు. అక్కడే బసచేసి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తిచెందుతున్న వేళ ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని స్థానికులను కోరారు.

Read More

ప్రణాళికాబద్దంగా రైతువేదికలు

సారథి న్యూస్​, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణాలను ప్రణాళికాబద్దంగా, సకాలంలో పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణంపై సోమవారం పంచాయతీరాజ్​శాఖ ఈఎన్సీతో కలిసి ఎన్టీపీసీలోని మిలీనియంహాల్​లో సంబంధిత అధికారులతో కలెక్టర్​ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నియంత్రిత వ్యవసాయసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులంతా పెట్టుబడికి తగిన దిగుబడి సాధిస్తారని […]

Read More

‘కరోనా’పై ఇంత నిర్లక్ష్యమా!

సారథిన్యూస్​, రామగుండం: తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలని వామపక్ష నాయకులు డిమాండ్​ చేశారు. కరోనా పేషంట్లకు సరైన వైద్యం అందడం లేదని వారు విమర్శించారు. శుక్రవారం పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంల్​ న్యూడెమోక్రసీ, తెలంగాణ ప్రజాఫ్రంట్​ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో కేవలం 88 మంది వైద్యసిబ్బంది మాత్రమే ఉన్నారని.. దీంతో రోగులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా […]

Read More
నారాయణకు ఘన నివాళి

నారాయణకు ఘన నివాళి

సారథి న్యూస్​, రామగుండం: సీపీఐ నేత ఎం.నారాయణ.. నిజాయితీకి మారుపేరు అని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి కొనియాడారు. గురువారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని భాస్కర్​రావుభవన్​లో ఎం.నారాయణ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు వారు హాజరై ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్​, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళవేన శంకర్, యూనియన్ […]

Read More

మతోన్మాద శక్తులను అడ్డుకుందాం

సారథి న్యూస్​, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలో బుధవారం అఖిలభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్​ఎఫ్​) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు జెండాను ఆవిష్కరించారు. ఏఐఎస్​ఎఫ్​ మతోన్మాద శక్తులకు వ్యతిరేంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్​ఎఫ్​ నగర అధ్యక్ష, కార్యదర్శులు రేణుగుంట ప్రీతం, ఈర్ల రామచందర్​ పాల్గొన్నారు.

Read More
రామగుండం ఎమ్మెల్యేకు కరోనా

రామగుండం ఎమ్మెల్యేకు కరోనా

సారథి న్యూస్, రామగుండం: ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పాజిటివ్​ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్​లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వీడియోను రామగుండం ప్రజల కోసం విడుదల చేశారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి కోరారు.

Read More