హెలికాప్టర్ ప్రమాద మృతుల గుర్తింపు మరో ఆరుగురి మృతదేహాల అప్పగింత న్యూఢిల్లీ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను శనివారం గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సైనికాధికారి సాయితేజతో పాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. వారి పార్థీవదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: లక్షణాలు ఉన్నవాళ్లందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మెదక్ జిల్లా కంగ్టి పీహెచ్సీ డాక్టర్ మనోహర్‌రెడ్డి సూచించారు. మండలంలో రోజురోజుకూ కరోనా పెరుగుతున్నదని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని సూచించారు. బుధవారం కంగ్టి పీహెచ్సీలో కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వారందరినీ క్వారంటైన్లో ఉండాలని ఆయన సూచించారు.
సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలకేంద్రం, గండిగోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో రవిసింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో సౌకర్యాలు ఏలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. విధిగా టెస్టులు చేస్తున్నారా అని సిబ్బందిని ప్రశ్నించారు. ప్రతిరోజు 50 మందికి పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ రాధిక రవిసింగ్‌కు తెలిపారు. కార్యక్రమంలో గోపాల్‌రావు పేట ఎంపీటీసీ ఎడవెళ్లి కరుణశ్రీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామగుండం: కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీపీఐ నేతలు కనకరాజ్, యాకయ్య, నరేశ్ డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా రామగుండం ప్రభుత్వాస్పత్రిని సీపీఐ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరోనాను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసవసతులు లేవని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు వైవీ రావు, మద్దెల దినేశ్, తోకల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా ప్రభుత్వం విఫలమైందన్నారు. ‘అమెరికాలో టెస్టులు చేసిన 24 గంటలకు ఫలితాలు వస్తున్నాయి. ఇది ఒక పనికిమాలిన విధానం. దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. టెస్టులు చేయించుకున్న కరోనా అనుమానితులు ఇష్టమున్నట్టు ప్రజల్లో తిరిగి కరోనాను వ్యాపింపచేస్తారు. దీంతో కరోనా మరింత పెరుగుతుంది. టెస్టులు చేసిన కొన్ని నిమిషాల్లోనే ఫలితాలు రావాలి. కరోనా పేషేంట్లందరనీ క్వారంటైన్ చేయాలి అప్పడే వ్యాధిని […]
బెంగళూరు: ప్రభుత్వాలు కరోనా లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేసి.. వారికి వ్యాధి నిర్ధారణ అయితే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు టెస్టులు చేయించుకొనే సమయంలో తప్పుడు ఫోన్‌నంబర్లు, అడ్రస్ ఇస్తూ తప్పించుకుపోతున్నారు. దీని వల్ల వారు కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య ఏకంగా 11 వేల వరకూ ఉన్నట్టు సమాచారం. వాళ్లందరికీ కరోనా పాజిటివ్ […]