Breaking News

కేసులు

పెద్దశంకరంపేటలో కరోనా కలకలం

సారథి న్యూస్, పెద్ద శంకరంపేట: కరోన తీవ్రత కొనసాగుతోంది. మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట పీహెచ్​సీలో గురువారం 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని వైద్య​అధికారులు సూచిస్తున్నారు. కొంతమంది అజాగ్రత్త వల్ల మిగతావారు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు.

Read More

మొత్తం కేసులు @ 30 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 69,239 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల మొత్తం కేసుల సంఖ్య 30,44,941 కు చేరుకున్నది. నిన్న ఒక్కరోజే 912 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన వారిసంఖ్య 56,706 కు చేరింది. 57,989 మంది కోవిడ్‌ పేషంట్లు శనివారం కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 22,80,567 […]

Read More

ప్రభుత్వ భూమి కబ్జా.. 40 మందిపై కేసు

పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Read More

వరుసగా రెండో రోజూ 60 వేలు దాటాయ్‌..

ఢిల్లీ: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజూ దేశంలో 60 వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. శుక్రవారం ఒక్క రోజే దేశంలో కొత్తగా 61,537 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,88,612కి చేరింది. అలాగే, రికార్డు స్థాయిలో ఒక్కరోజే 933మంది మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 42,518కి పెరిగింది. దేశంలో మరణాల రేటు ప్రస్తుతం 2.05గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మరోవైపు, […]

Read More
దేశంలో భారీగా పెరుగుతున్న కేసులు

52 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52,123 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 64.4 శాతం రికవరీ రేటు ఉన్నదని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు 10,20,582 మంది కరోనా నుంచి కోలుకోగా.. కేవలం గత 24 గంటల్లోనే 32,553 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 34, 968 మంది పొట్టనబెట్టుకున్నది. 5,28,242 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More
పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

15 లక్షలు దాటిన కరోనా కేసులు

ఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15,31,669 మంది కరోనా బారినపడ్డారు. కేవలం గత 24 గంటల్లోనే 48,513 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 5,09,447 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. 34,193 మంది కరోనాతో మృతిచెందారు. 9,88,028 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. త్వరలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Read More
దేశంలో పెరుగుతున్న కేసుల సంఖ్య

47 వేల కొత్తకేసులు

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. గత 24 గంటల్లో 47,703 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 14,83,156 కు చేరింది. వరుసగా ఆరోరోజు 45 వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని వైద్యశాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా మరణాల సంఖ్య భయంకరంగా పెరుగుతూనే ఉన్నది. ఇప్పటికి 33,425 మంది కరోనాతో మృతిచెందారు. 9,52,743 మంది డిశ్చార్జి కాగా.. 4,96,988 యాక్టివ్​ కేసులున్నాయి.

Read More
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

14 లక్షలకు చేరువలో కేసులు

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 48,916 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,36,861కి చేరుకున్నది. ఇప్పటివరకు కరోనాతో 31,358 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా 8,49,432 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటికి 4,56,071 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలని ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read More