సారథిన్యూస్, రామడుగు: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అన్నదాతల పాలిట గొప్పవరమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పథకం లేదని చెప్పారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన దుర్గం రములు అనే రైతు ఇటీవలే చనిపోగా అతడి కుటుంబానికి బుధవారం ఎమ్మెల్యే రైతు బీమా ప్రొసీడింగ్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ కల్గెటి కవిత, జెడ్పీటీసీ మారుకొండ […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : సీఎం కేసీఆర్ గిరిజనుల ఆత్మ బంధువని అక్కన్నపేట ఎంపీపీ మాలోతు లక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా అక్కన్నపేట మండలం కపూర్ నాయక్ తండాలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, కల్యాణ లక్ష్మితో పాటు అనేక సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ నాయక్, ఉప సర్పంచ్ స్వరూప, అధికారులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, బెజ్జంకి: మత్స్య పరిశ్రమను అభివృద్ది చేస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామికశాఖ అధ్యక్షుడు పోలు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం బెజ్జంకి మండలంలో చేపపిల్లలను పెంచుతున్న చెరువులు, కుంటలను పరిశీలించారు. రాష్ట్రంలో వ్యవసాయ పంటలు, చేపలను పెంచేందుకు రైతాంగానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరవెని పోచయ్య ముదిరాజ్, ఇల్లంతకుంట మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చొప్పరి రామచంద్రం ముదిరాజ్, రాజేశం, నర్సయ్య, శంకర్ […]
సారథి న్యూస్, చొప్పదండి: సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతు బీమా పథకం ఓ కుటుంబాన్ని ఆదుకున్నది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామానికి చెందినపిట్టల రాజు, మనీషా తండ్రి గతములో చనిపోయాడు. తల్లి విజయ కూడా ఇటీవల మరణించింది. దీంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. కాగా, తల్లి విజయ పేరు మీద భూమి ఉండడంతో రైతుబీమా కింద రూ. ఐదు లక్షలు వారి పిల్లలకు మంజూరయ్యాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్రాజు,మనీషాకు చెక్కును మంగళవారం […]
సారథి న్యూస్, హైదరాబాద్: ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టాలని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనపై సోమవారం హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మోడ్రన్ స్లాటర్ హౌస్ లు నిర్మించాలన్నారు. సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు […]
సారథి న్యూస్, గోదావరిఖని: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రెని హాస్పిటల్ కరీంనగర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ శంకర్నాథ్ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పోలీసులు విపత్కకర సమయంలో ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు.
సారథి న్యూస్, రామడుగు: వానకాలం పంట సాగు ప్రణాళిక, నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి యాస్మిన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాలు క్లస్టర్ల వారీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 26న రామడుగు, శానగర్, 27న గోపాల్ రావుపేట్, రుద్రారం, 28న వెలిచాల, దేశరజ్ పల్లి గ్రామాల్లో నిర్వహిస్తామని చెప్పారు. రైతులు తప్పకుండా హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.