సారథి న్యూస్, మహబూబ్‌నగర్: ఓ వైపు ఏసీబీ అధికారులు ఆట కట్టిస్తున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కీసర తహసీల్దార్ నాగరాజు, మెదక్ జేసీ ఉదంతం మరువకముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరోపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ రూ.1.65 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లో క్లోరినేషన్ మెటీరియల్ ను అలీ అహ్మద్ అనే వ్యాపారి సరఫరా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం ఏకకాలంలో హైదరాబాద్‌లో ఆరుచోట్ల దాడులు నిర్వహించారు. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన ఆయన పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూవివాదాల్లో తలదూర్చారనే ఉన్నాయి. తన వాళ్లకు అన్ని పనులు చేసిపెట్టేవారని వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ సోదాలు చేశారు.
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు ఆయన ఆస్తులపై విచారణ మొదలుపెట్టిన అధికారులు సారథి న్యూస్, మెదక్: భూవివాదంలో పరిష్కారానికి రూ.1.12 కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మొదక్ పట్టణంలోని మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఇతర ఆస్తులపై కూడా విచారణ మొదలైంది. ఏసీబీ […]
హైదరాబాద్: కీసర తహసీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఒక్క పైసా సంబంధం ఉన్నా శిక్షకు సిద్ధమని ప్రకటించారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్ హెడ్స్ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు […]
సారథి న్యూస్, పెబ్బేరు: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో సూగూర్ వీఆర్వో రూ. 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సూగూరుకు చెందిన ఆంజనేయులు అనే రైతుకు కొంతకాలంగా అతడి సోదరుల మధ్య భూవివాదం నడుస్తున్నది. వీరి భూసమస్యను పరిష్కరించేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. కాగా, ఆంజనేయులు ఏసీబీని సంప్రదించాడు. రంగంలోకి దిగిన అధికారులు గురువారం […]
సారథిన్యూస్, గద్వాల: లంచం తీసుకుంటూ జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్‌వో భీమ్‌నాయక్ ఏసీబీ అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో డాక్టర్ ఏ మంజుల మెడికల్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్ అయ్యారు. ఇందుకోసం రిలీవింగ్ ఆర్డర్ కోసం డీఎంహెచ్‌వోకు దరఖాస్తు చేసుకున్నారు. లంచాలకు అలవాటు పడ్డ డీఎంహెచ్‌వో తన కిందిస్థాయి ఉద్యోగిని సైతం రూ. 7000 లంచం అడిగాడు. దీంతో మంజుల […]
సారథిన్యూస్, చేవెళ్ల: భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్య ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. లక్ష 20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం షాబాద్ పీఎస్‌లో శంకరయ్య యాదవ్, ఏఎస్సై రాజేందర్.. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ శంకరయ్యపై గతంలోనూ అవినీతి కేసులున్నాయి. రంగారెడ్డి […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, శాసనసభ ప్రతిపక్ష ఉపనేత, టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో శుక్రవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వేకువజామునే గ్రామానికి విజయవాడ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చారు. ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక బస్సులో విజయవాడకు తరలించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయనపై ఈఎస్ఐ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఉన్నాయి. అచ్చెన్నాయుడి అరెస్ట్ నేపథ్యంలో […]