Breaking News

అభివృద్ధి

ప్రగతిపథంలో పల్లెలు

సారథి న్యూస్​, మల్దకల్: గ్రామాల అభివృద్దిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆమె మల్దకల్​ మండల ప్రజాపరిషత్​ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఫైళ్లను పరిశీలించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకున్నారు.

Read More

మావోయిస్టులూ.. విధ్వంసం ఆపండి

సారథిన్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులను, గిరిజనలకు తీరని అన్యాయం చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ విమర్శించారు. జిల్లాలోని చర్ల మండలం బత్తినపల్లి, తిప్పాపురం గ్రామాల మధ్య ప్రభుత్వం రోడ్డును నిర్మిస్తుంటే మావోయిస్టులు రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న యంత్రాలను ధ్వంసం చేశారన్నారు. ఏజేన్సీ ప్రాంతంలో మావోయిస్టులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. మావోయిస్టులు ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపాలని ఆయన సూచించారు.

Read More

సకాలంలో పనులు పూర్తిచేయండి

సారథిన్యూస్​, వరంగల్ అర్బన్: వరంగల్​ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ అరవింద్​ కుమార్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం వారు వరంగల్​లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతీ, కుడా […]

Read More

ఆదిలాబాద్​పై వివక్ష

సారథి న్యూస్ ఆదిలాబాద్: సీఎం కేసీఆర్​ ఆదిలాబాద్ జిల్లాపై కక్ష గట్టారని.. అభివృద్ధికి నిధులు కేటాయించకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. మంగళవారం ఆయన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్​తో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సూపర్​ స్పెషాలిటీ హాస్పిటల్​ పనులను పరిశీలించారు. వెనుకబడిన అదిలాబాద్ జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కార్డియాలజీ, న్యూరాలజితోపాటు తొమ్మిది విభాగాలతో కూడిన ఆధునిక హంగులతో ఆస్పత్రి భవనానికి 150 కోట్లు […]

Read More

అభివృద్ధికి చిరునామా తెలంగాణ

సారథిన్యూస్​, రామడుగు: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి చిరునామా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం MLA సుంకే రవిశంకర్ శంకుస్థపాన చేశారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మైదానంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సర్పంచ్ జీవన్, ఎంపీపీ కవిత నాయకులు జితేందర్ రెడ్డి, కర్ణాకర్, కల్గెటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Read More

టీఆర్​ఎస్​తోనే అభివృద్ధి

ఖమ్మం: టీఆర్​ఎస్​ హయాంలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్​ పరిధిలోని 41, 43వ డివిజన్ మిర్చి మార్కెట్ రోడ్ లో రూ.కోటితో నిర్మించిన డబుల్ రోడ్, సెంట్రల్ లైటింగ్ పనులను మేయర్ పాపాలాల్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ అనురాగ్​ జయంతి, కార్పొరేటర్​, మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.

Read More