సారథి న్యూస్, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీమంత్రి బస్వరాజు సారయ్య. కళాకారుడు గోరటి వెంకన్న, దయానంద్ గుప్తాకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. గవర్నర్ కోటాలో ఆ ముగ్గురు పేర్లను శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో వెల్లడించారు. త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానున్న నేపథ్యంలో ఈ ముగ్గురు పేర్లు ఎంపిక చేశారు. దివంగత మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీకాలం ముగియనుండడంతో పై ముగ్గురికి […]
బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, హైదరాబాద్: మానవ తప్పిదాలతో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు విశ్వనగరం హైదరాబాద్ నీట మునిగిందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. వరదల సమయంలో తక్షణ రక్షణ […]
సారథి న్యూస్, దుబ్బాక: దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ముగిసింది. 82.61 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 6గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో 86.24శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి పోలింగ్ శాతం తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కాగా, […]
ఒక క్లిక్‌తో భూముల వివరాలను ఎక్కడైనా చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా తహసీల్దార్ కార్యాలయాలు పాత రిజిస్ట్రేషన్ చార్జీలే వర్తిస్తాయి.. ‘ధరణి’ పోర్టల్ ప్రారంభంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఎంతో శ్రమించి తీసుకొచ్చిన ధరణి పోర్టల్ పూర్తి పారదర్శకంగా ఉంటుందని, 1,45,58,000 ఎకరాల భూములు ఇందులో దర్శనమిస్తున్నాయని సీఎం కె.చంద్రశేఖరావు అన్నారు. భూముల వివరాలను దేశవిదేశాల్లో ఉన్న వారు ఎవరైనా చూసుకోవచ్చన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న […]
సారథి న్యూస్, బిజినేపల్లి: రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. పోర్టల్‌ను తహసీల్దార్అంజిరెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కురుమయ్య, పీఏసీఎస్చైర్మన్బాలరాజు గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మహేష్ రెడ్డి, మంగి విజయ్, బాలస్వామి, తిరుపతిరెడ్డి, పులిందర్ రెడ్డి పరిశీలించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: జియాగూడలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడమంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేను కట్టిస్తా. పెండ్లి నేను చేస్తా అన్నది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే’ అని సృష్టంచేశారు. డబుల్ […]
రెండు విభాగాలుగా చేసి ఐఏఎస్ లకు బాధ్యతలు అప్పగించాలి మరిన్ని సంస్థాగత మార్పులు జరగాలి వ్యవసాయశాఖపై సమీక్షలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతోందని, అందుకు తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. వర్షాకాలం పంటలను కొనుగోలు చేయడానికి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. ప్రగతిభవన్ లో శుక్రవారం […]
సారథి న్యూస్, హైదరాబాద్: వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు శుక్రవారం మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. యాసంగిలో పంటల సాగుపై చర్చిస్తారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం […]