300 హరితహారం మొక్కల తొలగింపు సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్ రోడ్డు దుర్గామాత ఆలయానికి వెళ్లే పక్కన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహరంలో మొక్కలను నాటారు. గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రతిరోజూ నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి సమీప స్థలంలో పెట్రోల్ బంక్ పనులు, మట్టి లెవలింగ్ […]
శివుడు అభిషేక ప్రియుడు జాగరణం శివరాత్రి ప్రత్యేకత ఏడాదికి ఒక్కరోజైనా శివార్చన చేస్తే ముక్తి శ్రీశైలం: శివుడు అభిషేకప్రియుడే గాకుండా.. బిల్వదళ ప్రియుడు. శివుడు ఎలా పిలిచినా అనుగ్రహిస్తాడని అందుకే భోళాశంకరుడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రి రోజున విధిగా చేస్తుంటారు. పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడం చేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. త్రిమూర్తుల్లో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. మహాశివరాత్రి […]
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కంగనా తిరుపతి/ కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా స్వామి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. దీంతో మల్లికార్జునస్వామి వారి దర్శనానికి నాలుగు గంటలు సమయం పట్టింది. ఈరోజు వేకువజామున నాలుగు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, స్వామివారి స్పర్శ దర్శనాలను దేవస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. […]
సారథి, ధరూర్: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ జూరాలకు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో జూరాల అందాలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. స్నేహితుల దినోత్సవం కావడంతో జూరాల పరిసరాల్లో ఫోన్లలో సెల్ఫీ ఫొటోలు దిగుతూ తమ ఆనందం పంచుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చినవారు పక్కనే ఉన్న చేపల వంటకాన్ని […]
సారథి, జూరాల(మానవపాడు): జూరాల ప్రాజెక్టు 47 గేట్లు ఎత్తి 4.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న రైతులను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నదిలోకి చేపలవేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. జూరాల జలాశయానికి 4 లక్షల 65వేల 500 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.920 మీటర్ల మేర నీటి మట్టం […]
శ్రీశైలం: శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. అంతకుముందు భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయాధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎన్నడూ లేని విధంగా కృష్ణానది పోటెత్తుతోంది. 2009లో కృష్ణమ్మ ఓ ప్రళయం సృష్టించింది. 2019లో రికార్డు స్థాయిలో పరవళ్లు తొక్కింది. 2020లో జూరాల మరో విధ్వంసాన్ని సృష్టించబోతుందా..? అవుననే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కన్నా ఈ సారి జూరాల ప్రాజెక్టుకు ఈ రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని జూరాల అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాలకు వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం […]
ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రేమికులు శ్రీశైలం, సుంకేసుల, జూరాల, అవుకుకు వెళ్లేందుకు టూరిస్టుల ఆసక్తి సారథి న్యూస్, కర్నూలు: కరోనా ముప్పు ఇప్పుడిప్పుడే తొలగిపోయినట్టు కనిపిస్తోంది. జిల్లాలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పలువురు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా తరలివస్తుండడంతో తుంగభద్ర, కృష్ణానదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి , నారాయణ్‌పూర్ డ్యాం గేట్లు ఎత్తడంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరదనీరు ఉధృతికి […]