300 హరితహారం మొక్కల తొలగింపు
సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్ రోడ్డు దుర్గామాత ఆలయానికి వెళ్లే పక్కన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహరంలో మొక్కలను నాటారు. గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రతిరోజూ నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి సమీప స్థలంలో పెట్రోల్ బంక్ పనులు, మట్టి లెవలింగ్ పనులు కొనసాగుతున్నాయి. అక్కడికి వెళ్లేందుకు అడ్డొస్తున్నాయని ప్రభుత్వ స్థలంలో మూడు వరుసల్లో ఉన్న 300 హరితహారం మొక్కలను తొలగించి మట్టితో చదునుచేశారు.