శివుడు అభిషేక ప్రియుడు జాగరణం శివరాత్రి ప్రత్యేకత ఏడాదికి ఒక్కరోజైనా శివార్చన చేస్తే ముక్తి శ్రీశైలం: శివుడు అభిషేకప్రియుడే గాకుండా.. బిల్వదళ ప్రియుడు. శివుడు ఎలా పిలిచినా అనుగ్రహిస్తాడని అందుకే భోళాశంకరుడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అందుకే అభిషేకాలు, బిల్వార్చనలను శివరాత్రి రోజున విధిగా చేస్తుంటారు. పరమశివుడు లింగాకారంలో పుట్టినరోజు కావడం చేత శివుడికి ఇష్టమైన ఆ రోజున శివపూజ జరపడం మంచిదని శైవం చెబుతోంది. త్రిమూర్తుల్లో మూడోవాడు శివుడు. బ్రహ్మ సృష్టికర్త. విష్ణువు సంరక్షకుడు. మహాశివరాత్రి […]
సామాజిక సారథి, వెల్దండ: దక్షిణకాశీగా పేరొందిన, స్వయంభుగా వెలిసిన గుండాల అంబా రామలింగేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మహాగణపతిపూజ, పూణ్యాహవాచనం, ధీక్షాధారణ, రక్షాబంధనం, యాగశాల ప్రవేశంతో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు మార్చి 15వ తేదీ వరకు జరుగుతాయి. ఈనెల 1న మంగళవారం మహాశివరాత్రి సందర్భంగా ఏకాదశరుద్రాభిషేకం, అభిషేకం అలంకరణ, లలితా అష్టోత్తర కుంకుమార్చాన వంటి విశేషపూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు, అర్చకులు తెలిపారు. 2వ తేదీన మూలమంత్ర హవనం, వాస్తుమండపారాధాన, […]