Breaking News

ప్రభుత్వం

రేషన్‌ అక్రమాలకు చెక్‌ !

రేషన్‌ అక్రమాలకు చెక్‌ !

వందశాతం ఆధార్‌తో అనుసంధానం సామాజిక సారథి, హైదరాబాద్‌: రేషన్‌ సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను రూపొందించింది. ఆధార్‌ అనుసంధానంతో పాటు సీసీ కెమెరాలను, బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నారు. అయితే కొందరు అధికారులు, రేషన్‌ డీలర్లు పేదల బియ్యాన్ని బ్లాక్​మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ప్రభుత్వ సర్వేల్లో తేలింది. వాస్తవానికి ప్రతి రెవెన్యూ అధికారులు రేషన్‌ షాపులను తనిఖీ చేసి సరుకులను వచ్చే నెలకు కేటాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల పర్యవేక్షణ […]

Read More
పెట్రోల్‌పై రూ.25 తగ్గింపు

పెట్రోల్‌ పై రూ.25 తగ్గింపు

ఖార్ఖండ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు రాంచి: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగినవేళ జార్ఖండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వంద దాటిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్‌ పై రూ.ఐదు, డీజిల్‌ పై రూ.10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. కేంద్రం తగ్గించిన ధరలకు అనుగుణంగా అనేక రాష్ట్రాలు కూడా పెట్రోల్‌ […]

Read More
రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

రైతులపై మోడీ ప్రభుత్వం వివక్ష

ధాన్యం సేకరణలో జాతీయ విధానం తీసుకురావాలి: కేకే గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్​ఎంపీల నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ: ధాన్యం సేకరణపై కేంద్రం జాతీయ పాలసీ తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఐ ధాన్యం సేకరణతో రైతులకు భద్రత ఉంటుందని, తెలంగాణలో పండిన ధాన్యాన్ని తీసుకోవాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద […]

Read More

బీమాకు దరఖాస్తు చేసుకోండి

సారథిన్యూస్, రామాయంపేట: పట్టాపాస్​ పుస్తకాలు ఉన్నవారందరూ రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీశ్ కోరారు. జూన్ 16, 2020 వరకు పట్టా పాస్ బుక్ లు వచ్చిన రైతులంతా ఈ పథకానికి అర్హులేనని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల వయస్సు నుంచి 59 సంవత్సరాల వయస్సు గల రైతులు ఈ పథకానికి అర్హులని చెప్పారు. మండలంలో ఇప్పటి వరకు 5697 మంది రైతులు రైతు భీమా కు తమ పేరును నమోదు […]

Read More

ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభం

సారథిన్యూస్, రామడుగు: కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థుల చదువు భారంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి టీ శాట్- దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తుంది. మంగళవారం తొలిరోజు విద్యార్థులకు టీవీ పాఠాలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలకేంద్రంలోని వివిధ గ్రామాల్లో విద్యార్థులు టీవీల ముందు కుర్చొని పాఠాలు విన్నారు. కానీ సిగ్నల్​ లేకపోవడం, పవర్​పోవడం వంటి సమస్యలు తలెత్తాయి.

Read More

ప్రభుత్వ భూమి కబ్జా.. 40 మందిపై కేసు

పుట్టాన్‌దొడ్డి(ఇటిక్యాల): ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డి శివారులో 171, 172 సర్వేనంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు గ్రామస్థులు ప్రయత్నించారు. దీనిపై రెవెన్యూ సిబ్బంది బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు యత్నించిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Read More

పేదలకు కార్పొరేట్​ విద్య

సారథిన్యూస్​, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో పేదవిద్యార్థులకు కార్పొరేట్ స్ఠాయి విద్య అందుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని ఇందిరానగర్​లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీఈవో మదన్ మోహన్, కార్పొరేటర్ చావా నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Read More

పెండ్లికి 20మందికే అనుమతి

భోపాల్​: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పెండ్లి వేడుకలకు కేవలం 20 మంది మాత్రమే హాజరకావాలని ఆదేశాలు జారీచేసింది. ఇంట్లో జరిగే పుట్టినరోజు తదితర వేడుకలకు 10 మంది మాత్రమే హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ ఆదేశాలను ఎవరు ఉల్లంఘించినా కఠినచర్యలు తీసుకుంటుమాని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు చేయకూడదని.. బహిరంగ ప్రదేశాల్లో 5 కంటే ఎక్కువమంది ఓకే చోట గుమికూడదని పేర్కొన్నది. కరోనా విస్తరిస్తున్న ప్రస్తుతతరుణంలో […]

Read More