సారథి న్యూస్, రామడుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైకాలజిస్టులను గుర్తించాలని కరీంనగర్ సైకాలజిస్ట్‌ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సుంకె రవిశంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్తాయిలో సైకాలజీ కౌన్సిల్ ఏర్పాటుచేయలని కోరారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు.
సారథి న్యూస్, రామడుగు: నియోజకవర్గ అభివృద్ధి, సాగు, తాగునీటి విషయంలో బహిరంగ చర్చకు రావాలని టీఆర్ఎస్ నేతలకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీసెల్అధ్యక్షుడు పులి ఆంజనేయులు సవాల్ విసిరారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిలో చొప్పదండి వెనకబడి ఉందన్నారు. తూముల నిర్మాణం విషయంలో మేడిపల్లి సత్యంపై అసత్య ఆరోపణలు తగవన్నారు. మాల్యాల నుంచి కోదురుపాక వరకు వరద కాల్వకు ఎన్ని తూములు ఉన్నాయి, వాటికి ఎంత కేటాయించారో చెప్పాలని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఐదు కి.మీ. […]
సారథిన్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన అరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌ను మంగళవారం డీపీడీఎఫ్( డెమొక్రటిక్ ప్రైవేట్ టీచర్స్ యూనియన్ ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. చంద్రశేఖర్‌గౌడ్ గతంలో డీపీడీఎఫ్ గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. చంద్రశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో వ్యవసాయమార్కెట్ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ కొత్తగంగారెడ్డి, డీపీడీఎఫ్ నాయకులు మాచర్ల మహేశ్, ఉపాధ్యక్షుడు గోవులకొండ అనిల్, కోశాధికారి రమేశ్, సభ్యులు […]
సారథి న్యూస్, రామడుగు: మోతె రిజర్వాయర్‌కు ఎట్టకేలకు అనుమతి లభించింది. పనులు వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో నిర్మిస్తున్న మోతె రిజర్వాయర్‌కు గతేడాది జూన్‌లో టెండర్లు పిలిచారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. రూ.180కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. రామడుగు, గంగాధర చొప్పదండి మండలాల్లో దాదాపు 30వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక […]
సారథి న్యూస్, చొప్పదండి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా కరీంనగర్జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో శనివారం కురుమ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జనగామ జిల్లాకు దొడ్డి కొమురయ్య జిల్లా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కచ్చు అనిల్, కచ్చు సతీష్, ఏముండ్ల రాజు, జగన్, నిట్టూ మునేశ్, దయ్యాల సాగర్, నరేష్, రాజశేఖర్, సతీష్, బీరేశ్ పాల్గొన్నారు.
సారథిన్యూస్, గంగాధర/రామడుగు/రామగుండం: భావితరాలు బాగుండాన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా మంగపేట గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రామడుగు మండలం గోపాల్రావుపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఆవరణలో పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ అధికారులు, సిబ్బందితో కల్సి పండ్ల మొక్కలను నాటారు. ఆయా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కర్ర […]
సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని 6వ వార్డులో ఉన్న అంగన్వాడీ సెంటర్‌ను బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ, కౌన్సిలర్ వడ్లూరి గంగరాజు తనిఖీచేశారు. పిల్లలు, గర్భిణులు, తల్లులకు అందుతున్న ఆహారం వివరాలను ఆరాతీశారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలను చేయకుండా సేవలు అందిస్తున్న వైద్యసిబ్బందిని చైర్పర్సన్ అభినందించారు. పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సూచించారు.
సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కేంద్రంలో చైర్ పర్సన్ గుర్రం నీరజ, ఇన్చార్జ్ కమిషనర్ సరిత బుధవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇందులో భాగంగా మురికి నీటి కాల్వల్లో పెరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశించారు.