సారథి న్యూస్, గద్వాల: కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత షేక్ షావలీ ఆచారి విమర్శించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని ఆరోపించారు. గద్వాల జిల్లాలో తక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అనారోగ్యంతో ఉన్నవారందరికీ టెస్టులు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు […]
సారథి న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్వో( జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి)గా డాక్టర్ చందూ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డిలో పని చేసిన ఈయన జిల్లా ఇంచార్జీ డీఎంహెచ్వోగా రావడం జరిగింది.
20తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు అపహరణ సారథి న్యూస్, జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలో షేరల్లి విధికి చెందిన జాహిరబేగం ఇంట్లో 20తులాల బంగారు ఆభరణాలు, రూ 40వేలు నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరణ చేసినట్లు బాధితులు నసిర్ తెలిపారు. బాధితులు నసిర్ తెలిపిన వివరాలు: సోమవారం మధ్యాహ్నం తమ అక్క జాహిరబేగం ఆమె కూతురు గద్వాల పట్టణంలోని ఆఖర్అలీవిధి లో బంధువుల పెళ్లికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో […]
తెలంగాణ రాష్ట్రంలోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో కృష్ణానది తీరాన ఈ బీచుపల్లి క్షేత్రం ఉంది. ఇక్కడి ప్రధాన దైవం ఆంజనేయస్వామి. వ్యాసరాయుల వారి ప్రతిష్ఠాపన అయిన ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితం. పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న ఈ పుణ్యస్థలంలో ఎంతో మంది మహాపురుషులు, యోగులు, రుషులు తపమాచరించిన దివ్యధామంగా వెలుగొందుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన హనుమాన్ ఆలయాల్లో ఒకటిగా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ ఆంజనేయస్వామి ప్రధాన […]
సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది, విలేకరులకు జడ్పీ చైర్ పర్సన్ సరిత ఆదివారం సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హనుమంతురెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ధర్మవరం రంగారెడ్డి, ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ సుజాత, షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఎర్రవల్లి ఎంపీటీసీ ఎల్కుర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.