Breaking News

గద్వాలలో భారీ చోరీ

  • 20తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు అపహరణ

సారథి న్యూస్​, జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలో షేరల్లి విధికి చెందిన  జాహిరబేగం ఇంట్లో 20తులాల బంగారు ఆభరణాలు, రూ 40వేలు నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరణ చేసినట్లు బాధితులు నసిర్ తెలిపారు. బాధితులు నసిర్  తెలిపిన వివరాలు: సోమవారం మధ్యాహ్నం తమ అక్క జాహిరబేగం ఆమె కూతురు గద్వాల పట్టణంలోని ఆఖర్అలీవిధి లో బంధువుల పెళ్లికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి తలుపులను, బిరువాను విరగగొట్టి బీరువాలో ఉన్న 20తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు అపహరణ చేసినట్లు తెలిపారు. మంగళవారం రోజు ఉదయం ఇంటి వద్దకు వచ్చి పరిశీలించగా ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. సిఐ హనుమంతు, ఎస్సై సత్యనారాయణ, క్లూస్ టీం అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ హనుమంతు తెలిపారు.