Breaking News

జాతీయం

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

భర్తపై కేసు పెట్టించి.. భార్య ఏం చేసిందో తెలుసా?

ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టింది భార్య. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. బెడిసికొట్టింది.. ‘ఇక లాభంలేదు.. నా భార్య గురించి నాకే తెలుసు.. నేనే నా భార్య కోపాన్న పోగొడుతాను’ అంటూ రంగంలోకి దిగాడు ఆ భర్త. ఇంతకీ ఏం చేశాడో తెలుసా? అయితే చదవండి. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యాభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. […]

Read More

ఉత్తరాఖండ్​లోనూ వీకెండ్​ లాక్​డౌన్​

డెహ్రాడూన్​: కరోనాను కట్టడి చేసేందుకు ఉత్తరాఖండ్​ ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. నాలుగు జిల్లాల్లో శని, ఆదివారాల్లో లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న డెహ్రాడూన్, హరిద్వార్​, ఉధమ్​సింగ్​ నగర్​, నైనిటాల్​లో లాక్​డౌన్​ కొనసాగనున్నది. పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి, వ్యవసాయపనులకు, నిర్మాణరంగ పనులకు మినహాయింపు ఇచ్చారు. మద్యం దుకాణాలు, హోటల్లు తెరుచుకోవచ్చు. అయితే మిగతా ప్రైవేట్​ కార్యాలయాలు, మార్కెట్లు, షాపింగ్​ మాల్స్​ మూసేయాల్సిందే. కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు […]

Read More

ఆడియో టేపులపై సీబీఐ విచారణ

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్​ షేకావత్​ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. గజేంద్రసింగ్​ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న ఓ ఆడియోను విడుదల చేసింది కాంగ్రెస్​ పార్టీ. అయితే ఆ వాయిస్​ తనది కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆడియోటేపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలనీ బీజేపీ నేత సంబిత్​ పాత్రా డిమాండ్​ చేశారు.

Read More
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్య

ముంబై: బిగ్​ అమితాబచ్చన్​ కుటుంబం కరోనాతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమితాబచ్చన్​తోపాటు ఆయన కుమారుడు అభిషేక్​, కోడల్​ ఐశ్వర్యరాయ్​, మనుమరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. కాగా అమితాబ్​, అభిషేక్​ దవాఖానాలో చికిత్స పొందుతుండగా.. లక్షణాలు ఏమీ కనిపించకపోవడంతే ఐశ్వర్యరాయ్​, ఆరాధ్య ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఐశ్వర్యకు కొన్ని లక్షణాలు బయటడపడటంతో ఆమె ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. ఐశ్వర్యతోపాటు ఆమె కూతురు కూడా అదే ఆస్పత్రిలో చేరారు.

Read More
జాన్​ లూయిస్​ మృతి

జాన్​లూయిస్​ ఇకలేరు

వాషింగ్టన్​: అమెరికాకు చెందని పౌరహక్కుల నేత, కాంగ్రెస్​ సభ్యుడు జాన్​ లూయిస్​(80) ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా ఆయన ప్యాంక్రియాటిక్​ కేన్సర్​తో బాధపడుతున్నారు. జాన్​ అమెరికాలో ఎన్నో పౌరహక్కుల ఉద్యమాలు చేశారు. యూఎస్​ ప్రతినిధుల సభలోనూ సభ్యుడికి వ్యవహరించారు. 1965లో ఆయనను అమెరికన్​ పోలీసులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ జాన్​ పౌరహక్కుల ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన మృతికి అమెరికా మాజీ ప్రెసిడెంట్​ […]

Read More

ఆరుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​లో 24 గంటల్లో వేర్వేరు ఎన్​కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు భద్రతాదళాల చేతుల్లో హతమయ్యారు. షోషియాన్​ జిల్లాలో శనివారం ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో మరణించారు. శుక్రవారం కుల్​గాం జిల్లాలో ముగ్గరు ఉగ్రవాదలు హతమైన సంగతి తెలిసిందే. వీరిలో జైషేమహ్మద్​ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్​ కూడా ఉన్నాడు.

Read More

కోవిడ్​ సెంటర్​లో లైంగికదాడి

ముంబై: కరోనాతో లక్షణాలతో కోవిడ్​ సెంటర్​లో చేరిన ఓ మహిళపై యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ హేయమైన ఘటన ముంబైలో చోటుచేసుకున్నది. కరోనా లక్షణాలతో ఓ మహిళ(40) నేవీ ముంబైలోని కోవిడ్​ సెంటర్​లో చేరింది. మహిళ రెండోఅంతస్థులో ఉండగా.. డాక్టర్​గా పరిచయం చేసుకున్న ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. సదరు యువకుడు కూడా అదే కోవిడ్​ సెంటర్​లో ఐదోఅంతస్థులో చికిత్సపొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More
కరోనాపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: భారత్​లో కరోనా సామాజికవ్యాప్తి మొదలైందని కేరళ సీఎం పినరయి విజయన్​ పేర్కొన్నారు. మనదేశంలో మొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైంది. అక్కడిప్రభుత్వం లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడంతో వ్యాధి అంతగా విస్తరించలేదు. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల వెల్లువెత్తాయి. భారత్​లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం సామాజికవ్యాప్తి జరిగిందని చెప్పలేదు. దీంతో విజయన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. […]

Read More