Breaking News

వరంగల్

గుమ్మడిదొడ్డిలో కరోనా టెస్టులు

గుమ్మడిదొడ్డిలో కరోనా టెస్టులు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని గుమ్మదొడ్డి గ్రామంలో వైద్యాధికారులు 42 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. అందులో నలుగురికి పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు. కరోనా టెస్టులు చేసిన వారిలో డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎల్టీ శ్రీనివాసరావు, రాజేష్, హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, లలిత కుమారి, కోటిరెడ్డి ఉన్నారు.

Read More
సంబురంగా ఆదివాసీ దినోత్సవం

సంబురంగా ఆదివాసీ దినోత్సవం

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలో సోమవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి దబ్బకట్ల లక్ష్మయ్య తెలిపారు. కరోనా సమయంలో కూడా పండుగను ఐక్యంగా జరుపుకోవడం శుభపరిణామమని అన్నారు. మండలంలో వాజేడు, పేనుగోల్ కాలనీ, మండపాక, గణపురం, గుమ్మడిదొడ్డి, చీపురుపల్లి, చెరుకూరు, పేరూరు, కృష్ణాపురం, కొంగాల, ముత్తారం, శ్రీరామ్ నగర్ గ్రామాల్లో జెండాలు ఎగరవేశామని తెలిపారు. ఆదివాసి అమరవీరుల త్యాగాలు, పోరాట ఫలితంగా ప్రపంచంలోని […]

Read More
ఎట్టకేలకు సెంట్రల్ జైలుకు..

ఎట్టకేలకు సెంట్రల్​ జైలుకు..

సారథిన్యూస్​, నల్లగొండ : నకిలీ విత్తనాల కేసులో కర్నూలు జిల్లాకు చెందిన కర్నాటి మధుసూదన్​రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు చండూర్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం భారీగా నకిలీ పట్టివిత్తనాలు పట్టుకున్న నల్లగొండ జిల్లా పోలీసులు కేసులో విచారణ పూర్తి చేసి ఎస్పీ ఏవీ రంగనాథ్​ ఆదేశాల మేరకు.. సీఐ సురేష్ కుమార్ శనివారం మధుసూదన్​రెడ్డిని వరంగల్ కు తరలించారు. నల్లగొండ కలెక్టర్ ఆదేశాల మేరకు […]

Read More
వేడుకలు వద్దు

వేడుకలు వద్దు.. మొక్కలు నాటండి

సారథి న్యూస్​, వరంగల్​: తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఆగస్టు 5న) ఎలాంటి వేడుకలు, ఉత్సవాలు చేయవద్దని వరంగల్​ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్​ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యకర్తలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైతే ఎవరి ఇండ్ల వద్ద వారు మొక్కలు నాటాలని సూచించారు. భారీగా గుమిగూడడం, కేక్​కట్​ చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టవద్దని కోరారు.

Read More
కరోనా మృతులకు ప్రత్యేక శ్మశానవాటిక

కరోనా మృతులకు ప్రత్యేక శ్మశానవాటికలు

సారథి న్యూస్​, వరంగల్: కరోనా బారినపడి మరణించిన వారి దహనానికి ప్రత్యంగా శ్మశానవాటికల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం వారితో సమీక్షించారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల కోసం వేర్వేరుగా ప్రత్యేక స్థలాలను గుర్తించాలన్నారు. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించడానికి అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఎఫ్ వో కిశోర్ ఆధ్వర్యంలో 12 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు వివరించారు. హోం క్వారంటైన్​కు మున్సిపల్ గెస్ట్​హౌస్​, […]

Read More
భారీగా గుట్కా పట్టివేత

భారీగా గుట్కా పట్టివేత

సారథి న్యూస్​, వర్ధన్న పేట : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తితో పాటు చుట్టు పక్కల గ్రామీణా ప్రాంతాల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా బ్యాగుల సరఫరాకు పాల్పడుతున్న  వ్యక్తిని మంగళవారం వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడి నుంచి సుమారు రూ.8.10 లక్షల విలువగల గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్​ వివరాలను వెల్లడిస్తూ.. గుమ్మడవెల్లి నాగరాజు అలియాస్ ఉప్పల్ నాగరాజు అలియాస్ తొర్రూరు నాగరాజు అలియాస్ […]

Read More
ఆ సత్తా మనకుంది

ఆ సత్తా మనకుంది

సారథి న్యూస్​, వరంగల్​ : ‘కరోనా లాంటి విపత్తులను అనేకం మనం ఎదుర్కొన్నాం..దీనిని ఎదుర్కొనే సత్తా మనకు ఉంది.. ప్రజలెవ్వరూ భయపడవద్దు’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్​, ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మంత్రులు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులతో  సీఎస్సార్ గార్డెన్స్ లో కోవిడ్ 19 పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ మన రాష్ట్రాన్నే కాదు కరోనా మహమ్మారి యావత్ […]

Read More
కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం

 ప్రజల్లో ధైర్యాన్ని నింపండి తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ…మీడియా, సోషల్ మీడియాకు విజ్ఞప్తి  సారథి న్యూస్​, హైదరాబాద్: మనమంతా మనుషులం..సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం. మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా కరోనా పేషంట్లని కరుణతో చూద్దాం. కరోనా బాధిత శవాలకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దాం…అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో తనతోపాటు విస్తృతంగా తిరిగిన తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ […]

Read More